రొమాంటిక్ హీరోగా చెర్రీ
మాస్ హీరోగా మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్న రామ్చరణ్ రొమాంటిక్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నాడు. గతంలో ఇదే ప్రయత్నం చేసినా వర్క్ అవుట్ కాకపోవటంతో లాంగ్ గ్యాప్ తీసుకొని మరోసారి రొమాంటిక్ ఎంటర్ టైనర్ కు రెడీ అవుతున్నాడు. ఫీల్ గుడ్ సినిమాల స్పెషలిస్ట్ గా పేరున్న టాప్ డైరెక్టర్ తో సినిమా ప్లాన్ చేసుకుంటున్నాడు. రామ్ చరణ్ ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నాడు. 'బ్రూస్లీ' పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో స్టంట్ మాస్టర్ గా నటిస్తున్న చెర్రీ ఆ క్యారెక్టర్ కోసం రిస్కీ స్టంట్స్ కూడా చేస్తున్నాడు.
చరణ్ కెరీర్లో ఒక్క 'ఆరెంజ్' తప్ప మిగతా సినిమాలన్నీ మాస్ యాక్షన్ జానర్ లో రూపొందినవే. కొత్తగా ప్రయత్నించిన ఆరెంజ్ డిజాస్టర్ టాక్ సొంతం చేసుకోవటంతో, తరువాత అలాంటి ప్రయత్నం చేయటమే మానేశాడు. లాంగ్ గ్యాప్ తరువాత ఇప్పుడు మరోసారి రొమాంటిక్ ఎంటర్టైనర్ చేయడానికి సిద్ధం అవుతున్నాడు. ఆ జానర్ సినిమాలు చేయటంలో స్పెషలిస్ట్ గా పేరున్న గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఓ సినిమాకు ప్లాన్ చేసుకుంటున్నాడు.
గౌతమ్ ప్రస్తుతం నాగచైతన్య హీరోగా 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమాను తెరకెక్కిస్తున్నాడు. రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమా పూర్తవ్వగానే చరణ్ తో చేయబోయే సినిమా స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టనున్నాడు. ఈ లోగా చరణ్ కూడా 'బ్రూస్లీ' షూటింగ్ పూర్తి చేసి నెక్ట్స్ సినిమాను స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. అయితే ఇప్పటికే సురేందర్ రెడ్డి తో సినిమా అంగీకరించిన చరణ్ ఏ సినిమాను స్టార్ట్ చేయనున్నాడో తెలియాలంటే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే.