
హంసానందిని హార్స్ రైడింగ్
చెన్నై:హీరోయిన్ గానే కాకుండా విభిన్న పాత్రలు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి హంసానందిని ప్రస్తుతం హార్స్ రైడింగ్ చేస్తుందట.ఇదేదో ఆమె సరదాగా నేర్చుకుంటున్నది కాదు. గుణశేఖర్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న రుద్రమదేవి సినిమా గాను ఆమె గుర్రపు స్వారీలు చేస్తూ చక్కర్లు కొడుతుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. ఇప్పటివరకూ తాను చేసిన పాత్రలో ఒకవైపు అయితే..ఈ సినిమాలో చేస్తున్న సరికొత్త పాత్ర మాత్రం ఖచ్చితంగా తనకు మరింత గుర్తింపు తీసుకువస్తుందని చెబుతుంది. 'అరుంధతి' అనుష్క ప్రధాన పాత్రతో రుద్రమదేవి చిత్రం శరవేగంగా రూపుదిద్దుకుంటుంది.
ఈ చిత్రంలో మదానికా రాణి పాత్రలో కనిపించబోతున్న హంసానందిని కత్తి పట్టి గుర్రం ఎక్కనుంది. ఈ క్రమంలోనే ఆమె కత్తి తిప్పడంతో పాటు గుర్రంపై స్వారీ చేస్తుంది. దీనికి గాను మూడు గంటలకు పైగా మేకప్ కోసం సమయం కేటాయించాల్సి వస్తుంది. ఈ తరహా పాత్రలో చేయాలంటే శారీరకంగా చాలా కష్టించకతప్పదని హంసా స్వీయ అనుభవం ద్వారా తెలుసుకుంది. ఇప్పటి వరకూ శారీరాకర్షణ కలిగిన పాత్రలు మాత్రమే చేసిన హంసాకు శరీరాన్ని మరింత కష్టపెట్టే ఈ చిత్రం మరింత పేరు ప్రఖ్యాతులను తీసుకొస్తుందని ఆశిద్ధాం.