
ఆరు నెలల వరకు అగాల్సిందే: అనుష్క
మరో ఆరు నెలల వరకు కొత్త చిత్రాలలో నటించేందుకు ఒప్పుకునేది లేదని టాలీవుడ్ జేజమ్మ అనుష్క శెట్టి వెల్లడించింది. ప్రస్తుతం రుద్రమదేవి, బాహుబలి చిత్రాలతో మహాబిజీగా ఉన్నట్లు చెప్పింది. అదికాక ఆ రెండు చిత్రాలలో కొన్ని సన్నివేశాల కోసం గుర్రపు స్వారీ, కత్తి యుద్దాలు నేర్చుకోంటున్నట్లు వివరించింది. అంతేకాకుండా ఆ రెండు చిత్రాల షూటింగుల్లో పాల్గొనడంతో ఉన్న సమయం అంతా వాటిలో నటించడానికే సరిపోతుందని తెలిపింది.
రుద్రమదేవి, బాహుబలి చిత్రాలు షూటింగ్ పూర్తి అయ్యేవరకు విరామం అనేది ఉండదని చెప్పింది. బహుశ ఆ చిత్రాలు వచ్చే ఏడాది మొదట్లో విడుదల కావచ్చని చెప్పింది. అప్పుడు కానీ తనకు కాస్త విరామం దొరుకుంది, ఆ సమయంలో కొత్త చిత్రాలలో నటించేందుకు ఆలోచిస్తానని అనుష్క తెలిపింది. అయితే ఈ ఏడాది మొదట్లోనే చిత్రీకరణ పూర్తి చేసుకున్న తమిళ చిత్రం ఇరందమ్ ఉలగమ్ విడుదల కోసం ఎదురుస్తున్నట్లు చెప్పింది. ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి చిత్రం తెలుగు, తమిళంలో రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే.