
బాహుబలి సినిమాతో బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహర్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడైయ్యాడు. బాహుబలి సినిమాలో ఉత్తరాది అంత భారీగా రిలీజవ్వటంలో కరణ్ పాత్ర ఎంతో ఉంది. అంతేకాదు బాహుబలి ప్రమోషన్ సందర్భంగా ప్రభాస్, అనుష్కలతో స్ట్రయిట్ హిందీ సినిమాలను చేస్తానని పలు సందర్భాల్లో ప్రకటించాడు ఈస్టార్ ప్రొడ్యూసర్. ఆ మాట నిలబెట్టుకుంటూ కొద్ది రోజుల క్రితం ప్రభాస్‌తో సినిమాకు ప్లాన్ చేశాడు. అయితే కరణ్ తీసుకువచ్చిన కథ ప్రభాస్‌కు నచ్చకపోవటంతో ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు.
తాజాగా మరోసారి ఈ బాలీవుడ్‌నిర్మాతకు అదే పరిస్థితి ఎదురైందన‍్న ప్రచారం జరగుతోంది. ప్రభాష్‌తో ఎలాగూ కుదరలేదని కనీసం అనుష్కతో అయిన హిందీ సినిమా నిర్మిద్దామని భావించిన కరణ్ జోహర్‌కు మరోసారి నిరాశే ఎదురైందట. కరణ్ తీసుకు వచ్చిన కథలో తన పాత్ర నచ్చకపోవటంతో అనుష్క కూడా ఆ సినిమాకు నో చెప్పిందట. ఏదో ఒక సినిమాతో హడావిడిగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చే ఉద్దేశం లేదని, తమకు మంచి గుర్తింపు రావటంతో పాటు పక్కాగా హిట్ కొట్టే కథ అయితేనే ఆ సినిమా చేయాలని భావిస్తున్నారట. మరి కరణ్ అలాంటి కథతో ప్రభాస్, అనుష్కలను ఒప్పిస్తాడేమో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment