సాహో తరువాత బాలీవుడ్ సినిమా : ప్రభాస్‌ | Prabhas to debut in Bollywood as a romantic hero | Sakshi
Sakshi News home page

సాహో తరువాత బాలీవుడ్ ఎంట్రీ

Published Tue, Jan 2 2018 12:27 PM | Last Updated on Tue, Jan 2 2018 12:40 PM

Prabhas to debut in Bollywood as a romantic hero - Sakshi

బాహుబలి సినిమాతో జాతీయ నటుడిగా మారిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ త్వరలో సాహో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్ సన్నివేశాల కోసం సిద్ధమవుతున్నారు ప్రభాస్. ఈ సినిమా తరువాత తను చేయబోయే సినిమా విశేషాలు తెలిపారు బాహుబలి. చాలా రోజులుగా ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ పై వార్తల వినిపిస్తున్న నేపథ్యంలో తన నెక్ట్స్ సినిమా బాలీవుడ్ లోనే అంటూ క్లారిటీ ఇచ్చారు.

మూడేళ్ల క్రితమే ఓ బాలీవుడ్ సినిమా అంగీకరించానని ఓ ఇంటర్య్వూలో వెల్లడించారు ప్రభాస్. అది ప్రేమకథ అని తెలిపిన యంగ్ రెబల్ స్టార్ ఆ సినిమా కరణ్ జోహర్ నిర్మాణంలో చేస్తారా..? లేక మరో నిర్మాతతో చేస్తారా అన్ని విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. అయితే కరణ్ జోహర్ తనకు మంచి స్నేహితుడన్న ప్రభాస్, తనతో ఏవిషయమైనా మోహమాటం లేకుండా మాట్లాడగలనన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement