
ఇద్దరం ఆధ్యాత్మికంగా కనెక్ట్ అయ్యాం!
‘‘అనుష్కతో కలిసి డాన్స్ చేయడానికి చాలా కష్టపడ్డాను. ఆమెకూ నాకూ చాలా హైట్ డిఫరెన్స్ ఉంది. దాంతో ఆ టైమ్‌లో చాలా ఇబ్బంది పడ్డాను కూడా. నా కష్టం చూసి ఆమె కూడా నాకు సహకరించింది. ‘రుద్రమదేవి’ సినిమాలో నాకూ, అనుష్కకూ ఓ పాట ఉంది. ఆ పాటను మాత్రం నా జీవితంలో మర్చిపోలేను. అనుష్కకు సమానంగా ఉండటానికి నాతో బలవంతంగా హై హీల్స్ వేయించారు. దాంతో నా పాదాలకు గాయాలయ్యాయి.
నా పాట్లు చూసి అనుష్క డాన్స్ చేసేటప్పుడు తన మోకాళ్లను వంచి నృత్యం చేసింది. నిజంగా ఆమె చాలా స్వీట్ పర్సన్. నేను చూసిన వాళ్లలో చాలా మంచి వ్యక్తి. ఈ సినిమా నుంచి ఆమెతో నాకు మంచి అనుబంధం ఏర్పడింది. ఇద్దరం చాలా ఆధ్యాత్మికంగా కనెక్ట్ అయ్యాం. నాకు యోగా అంటే చాలా ఇష్టం. యోగా టీచర్ అవ్వాలని అనుకునేదాన్ని. అనుష్క ఎలాగూ యోగా శిక్షకురాలిగా పనిచేశారు. దాంతో మేమిద్దరం కలిస్తే ఆధ్యాత్మిక విషయాలు, యోగా గురించి కూడా బాగా మాట్లాడుకుంటాం.’’
- నిత్యామీనన్