వరుడి వేటలో అనుష్క | Anushka Shetty hunt for groom | Sakshi
Sakshi News home page

వరుడి వేటలో అనుష్క

Published Sun, Jun 8 2014 11:31 PM | Last Updated on Thu, Mar 28 2019 6:31 PM

వరుడి వేటలో అనుష్క - Sakshi

వరుడి వేటలో అనుష్క

నటి అనుష్క పెళ్లి పీటలెక్కనుందా? ప్రస్తుతం తమిళం, తెలుగు చిత్ర పరిశ్రమల్లో  చర్చనీయాంశంగా మారిన విషయం ఇదే. మూడు పదుల వయసు దాటిన హీరోయిన్లలో అనుష్క ఒకరు. ఈ బ్యూటీ వయసు 32 ఏళ్లు. హీరోయిన్‌గా తమిళం, తెలుగు భాషల్లో టాప్ లెవల్‌లో దూసుకుపోతున్న ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం చేస్తున్న చిత్రాలన్నీ భారీ బడ్జెట్ చిత్రాలే. అరుంధతి చిత్రం తరువాత అనుష్క స్థాయి అనూహ్యంగా పెరిగిపోయింది. ఈ బహుభాషా నటి ప్రస్తుతం తెలుగులో చారిత్రాత్మక కథా చిత్రాలు రుద్రమదేవి, బాహుబలి చేస్తున్నారు.
 
 ఈ రెండు చిత్రాల్లోను కత్తిపట్టి శత్రువులను వెంటాడే పాత్రలే పోషిస్తున్నారు. అలాగే తమిళంలో సూపర్ స్టార్‌తో తొలిసారిగా లింగా చిత్రంలో జోడీ కడుతున్నారు. అజిత్ సరసన మరో భారీ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇప్పటికిప్పుడు ఈ బ్యూటీ ఊ అంటే మరెందరో దర్శక నిర్మాతలు ఆమె ఇంటి ముందు క్యూకట్టేందుకు రెడీగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలో అనుష్క తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి చేయూలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అనుష్కకు వరుడి వేటలో ఉన్న వాళ్లు ఇప్పటికే ముగ్గురిని ఎంపిక చేసినట్లు సమాచారం. వారిలో ఒకరు వ్యాపారవేత్త మరొకరు సినీ దర్శకుడు, ఇంకొకరు ఇంజనీర్ అని తెలిసింది. తగిన వరుడు లభిస్తే వచ్చే ఏడాది అనుష్క పెళ్లి ఖాయమని సమాచారం. అనుష్క కూడా ప్రస్తుతం అంగీకరించిన చిత్రాలను పూర్తి చేసే పనిలో పడ్డారట.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement