రుద్రమదేవికి తప్పని దొంగ దెబ్బ | 'Rudhramadevi' pyracy cds recoverd by police | Sakshi
Sakshi News home page

రుద్రమదేవికి తప్పని దొంగ దెబ్బ

Published Mon, Oct 12 2015 3:11 PM | Last Updated on Tue, Aug 21 2018 5:52 PM

రుద్రమదేవికి తప్పని దొంగ దెబ్బ - Sakshi

రుద్రమదేవికి తప్పని దొంగ దెబ్బ

హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమను పట్టి పీడిస్తున్న పైరసీ భూతం రుద్రమ దేవిని కూడా పట్టుకుంది. అహోరాత్రిళ్లు దర్శక నిర్మాతలు ఎంతో కష్టపడి, కోట్లకు కోట్టు ఖర్చు పెట్టి  సినిమాలను రూపొందిస్తుంటే అక్రమార్కులు మాత్రం వారికి తీరని నష్టాలను  మిగులుస్తున్నారు. తాజాగా గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన 'రుద్రమదేవి' చిత్రం కూడా పైరసీ బారిన పడింది . ఈ కేసులో సీసీఎస్ పోలీసులు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. వారి నుండి ఒక ల్యాప్ టాప్, కొంత నగదు, హార్డ్ డిస్క్ లు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.

తెలుగులో విడుదలైన  దాదాపు ప్రతి సినిమానూ ఈ పైరసీ పీడ చుట్టుకుంటోంది.   చివరకు కోట్ల రూపాయల బిజినెస్ సాధించిన రాజమౌళి భారీ బడ్జెట్ సినిమా 'బాహుబలి'కి కూడా ఈ నష్టాలు తప్పలేదు. ఈ క్రమంలో సినిమా విడుదలైన రెండు రోజుల్లోనే రుద్రమదేవి  సినిమా  పైరసీ సీడీలు భారీగా మార్కెట్లోకి వచ్చినట్లు తెలుస్తోంది.  ఇప్పటికే తెలుగు, హిందీలో  విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న  ఈ త్రీడి సెన్సేషనల్ మూవీ రుద్రమదేవీ  తమిళంలో శుక్రవారం విడుదల కానుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement