recoverd
-
హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన అడివి శేష్
Adivi Sesh Discharged From The Hospital: టాలీవుడ్ హీరో అడివి శేష్ కోలుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్ ద్వారా తెలిపారు. 'ఇంటికి తిరిగి వచ్చాను. విశ్రాంతి తీసుకుంటూ కోలుకుంటాను' అని ట్వీట్లో పేర్కొన్నారు. కాగా కొద్ది రోజుల క్రితం అడివి శేష్ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. డెంగ్యూ బారినపడి, ఆయనకు రక్తంలో ప్లేట్లెట్స్ అకస్మాత్తుగా తగ్గిపోవడంతో ఈనెల 18న హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. చదవండి : షాకింగ్ : రకుల్‌కు సర్జరీ వికటించిందా? అందుకేనా ఇలా! ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం శేష్ “మేజర్” సినిమాలో నటిస్తున్నారు. 26/11 ముంబై టెర్రర్ అటాక్ లో అమరుడైన ఆర్మీ ఆఫీసర్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో మహేష్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్ ఏ ప్లస్ ఎస్ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ఈ మూవీని నిర్మిస్తోంది. చదవండి : మహేశ్ బాబు ట్వీట్‌కి రిప్లై ఇచ్చిన ఏ.ఆర్.రెహమాన్ Back home. Rest & Recuperation. — Adivi Sesh (@AdiviSesh) September 27, 2021 -
కరోనా : కోలుకున్న సెంట్రల్ జైలు ఖైదీలు
ఢిల్లీ : కరోనా వైరస్ నుంచి రోహిణి జైలులోని 10 మంది ఖైదీలు, ఒక ఉద్యోగి బయటపడ్డారని మంగళవారం అధికారులు పేర్కొన్నారు. మే 15న హెడ్ వార్డెన్‌కి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. అయితే ఈయనకు జలుబు, దగ్గు లాంటి కరోనా లక్షణాలేవీ బయటపడలేదు. ఇది జైలులో కరోనా వ్యాప్తి అధికం కావడానికి మరొక కారణమని అధికారులు భావిస్తున్నారు. లక్షణాలు లేకపోవడంతో అందరితో మామూలుగానే ఉండటంతో కరోనా వేగంగా వ్యాప్తి చెందింది. (శ్రామిక రైళ్లలో అన్న పానీయాలు కరవు ) మే15న నిర్వహించిన కరోనా పరీక్షల్లో వైరస్ ఉన్నట్లు నిర్థారణ అయ్యింది. దీంతో అప్రమత్తమై జైలు అధికారులు మిగతా సిబ్బంది, ఖైదీలకు కరోనా పరీక్షలు నిర్వహించగా వారిలో 16 మంది ఖైదీలు, నలుగురు సిబ్బంది వైరస్ బారినపడినట్లు గుర్తించారు. దీంట్లో ఎక్కువగా జైలులోని కరోనా సోకిన ఖైదీతో బ్యారక్ పంచుకున్న వాళ్లే ఉన్నట్లు తేలింది. దీంతో వారందరినీ స్థానిక సోనిపేట్ ఆసుపత్రిలోని క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు. మంగళవారం నిర్వహించిన పరీక్షల్లో పదిమంది ఖైదీలు, ఒక ఉద్యోగి కోలుకున్నారని జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ సందీప్ గోయెల్ వెల్లడించారు. వీరికి మంగళవారం కరోనా నెగిటివ్ వచ్చినట్లు తెలిపారు. వైరస్ బారిన పడ్డ మిగతా ఖైదీలు కూడా తొందరగా కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. (6 రోజుల్లో కరోనాను జయించిన హెచ్ఐవీ పేషెంట్ ) -
ఆక్సిజన్ థెరపీతో కోలుకున్న 396 మంది
భోపాల్ : ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తుంది. భారత్‌లోనూ కోవిడ్ కేసుల సంఖ్య 60 వేలకు చేరువలో ఉంది. ఈ మహమ్మారికి మందులేని కారణంగా రోజోరోజుకు పెరుగుతున్న కరోనా కేసులతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లోని చిరాయి ఆసుపత్రిలో ఆక్సిజన్ చికిత్స ద్వారా 396 మంది కరోనా రోగులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. శుక్రవారం ఒక్కరోజే 18 మంది కోలుకున్నారని చిరాయు హాస్పిటల్ డైరెక్టర్ అజయ్ గొయెంకా ప్రకటించారు. ఆక్సిజన్ థెరపీ ద్వారా సత్ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. (మందు కొంటే ‘మార్క్’ పడాల్సిందే! ) డిశ్చార్జ్ అయిన తర్వాత 14 రోజుల పాటు ఇంట్లోనే స్వీయ నిర్భందంలోకి వెళ్లాలని సూచించినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా అయ్యాక తమ ఫ్లాస్మాను దానం చేయాల్సిందిగా కోరినట్లు వెల్లడించారు. అంతేకాకుండా భోపాల్ ఎయిమ్స్ నుంచి 2 కరోనా రోగులు కూడా ఆక్సిజన్ థెరపీ అందించడం వల్ల కోలుకున్నారని ఎయిమ్స్ డైరెక్టర్ శర్మాన్ తెలిపారు. ఆక్సిజన్ థెరపీ కరోనా రోగులపై మంచి ప్రభావం చూపుతుందని, దీని ద్వారా వారు త్వరగా కోలుకోగలుగుతున్నారని వెల్లడించారు. ఇక మధ్యప్రదేశ్‌లో 3341 కరోనా కేసులు నమోదవగా, వారిలో 1300కి పైగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా 40 లక్షల మందికి పైగా కోవిడ్ సోకగా, భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 60 వేలకు చేరుకుంది. -
రుద్రమదేవికి తప్పని దొంగ దెబ్బ
హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమను పట్టి పీడిస్తున్న పైరసీ భూతం రుద్రమ దేవిని కూడా పట్టుకుంది. అహోరాత్రిళ్లు దర్శక నిర్మాతలు ఎంతో కష్టపడి, కోట్లకు కోట్టు ఖర్చు పెట్టి సినిమాలను రూపొందిస్తుంటే అక్రమార్కులు మాత్రం వారికి తీరని నష్టాలను మిగులుస్తున్నారు. తాజాగా గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన 'రుద్రమదేవి' చిత్రం కూడా పైరసీ బారిన పడింది . ఈ కేసులో సీసీఎస్ పోలీసులు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. వారి నుండి ఒక ల్యాప్ టాప్, కొంత నగదు, హార్డ్ డిస్క్ లు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. తెలుగులో విడుదలైన దాదాపు ప్రతి సినిమానూ ఈ పైరసీ పీడ చుట్టుకుంటోంది. చివరకు కోట్ల రూపాయల బిజినెస్ సాధించిన రాజమౌళి భారీ బడ్జెట్ సినిమా 'బాహుబలి'కి కూడా ఈ నష్టాలు తప్పలేదు. ఈ క్రమంలో సినిమా విడుదలైన రెండు రోజుల్లోనే రుద్రమదేవి సినిమా పైరసీ సీడీలు భారీగా మార్కెట్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలుగు, హిందీలో విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న ఈ త్రీడి సెన్సేషనల్ మూవీ రుద్రమదేవీ తమిళంలో శుక్రవారం విడుదల కానుంది.