అంతర్జాతీయ వేదికపై గుర్తింపు పొందిన ప్రతి కళనూ, సృజనాత్మకతను, అధునాతన హంగులను అందిపుచ్చుకోవడంలో హైదరాబాద్ నగరం ఎల్లప్పుడూ ముందుంటుంది. ఇందులో భాగంగానే గ్లోబల్ వేదికగా ప్రసిద్ధి చెందిన కాస్ ప్లేను నగరానికి పరిచయం చేయడంలో భాగంగా ప్రతిష్టాత్మక ‘కామిక్ కాన్ 2024’ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు.
సిటీలోని హైటెక్స్ వేదికగా ఈ నెల 15, 16, 17 తేదీల్లో కామిక్ కాన్ కాస్ ప్లే వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ ఫెస్ట్‌లో కామిక్ కాన్ ఫేం సౌరభ్ సింగ్ రావత్‌తో పాటు దేశంలోని వివిధ నగరాల నుంచి కాస్ ప్లే సెలబ్రిటీలు సందడి చేయనున్నారు. గత కొంత కాలంగా నగరంలో కూడా కాస్ ప్లే ప్రత్యేక ఆదరణ పొందడమే కాకుండా దీని కోసం ఫ్యాన్ బేస్ కూడా పెరుగుతోంది. సిటీలో కూడా జోహైర్ ఖాన్ వంటి పలువురు కామిక్ కాన్ సెలబ్రిటీలుగా గుర్తింపు పొందారు. ది హైదరాబాద్ కాస్ ప్లేయర్స్ క్లబ్ నిర్వాహకులలో ఒకరు స్థానికంగా జరగనున్న కామిక్ కాన్ ఫెస్ట్‌కు నేతృత్వం వహిస్తున్నారు.
ఫ్యూచర్ ఫేం కాస్ ప్లే..
నగరంలో కామిక్ ఫెస్ట్ జరగనున్న నేపథ్యంలో కాస్ ప్లేలో భాగస్వామ్యం పంచుకునే వారికి స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్ వంటి విభిన్న డిజైన్ మేకింగ్, క్రియేటివ్ ఆర్ట్ వర్క్స్ రూపొందించడం ప్రధానాంశం. ఈ క్రియేటివిటీ పైన అవగాహన కలి్పంచడం కోసం కొన్ని రోజుల క్రితమే కామిక్ కాన్ ఫేం సౌరభ్ సింగ్ రావత్ నగరంలో కాస్ ప్లే వర్క్‌షాప్ నిర్వహించారు. ఉర్పీ జావేద్ వంటి ప్రముఖుల కోసం ఐకానిక్ కాస్ట్యూమ్‌లను రూపొందిస్తూ, టాప్ గ్లోబల్ బ్రాండ్‌లతో సౌరభ్ పని చేస్తుండటం విశేషం. ఈ వర్క్‌షాప్‌లో నగరంలోని ఔత్సాహికులు పాల్గొని ఆకర్షణీయ కాస్ ప్లే కళపై పట్టు సాధించారు.
సాధారణ వస్తువులు వినియోగించి..
సాధారణ వస్తువులు వినియోగిస్తూ కాస్ ప్లే డిజైనింగ్, ఆర్ట్ వర్క్ పై అవగాహన పెంచుకున్నారు. అయితే నగరంలో స్పోర్ట్స్, సినిమాలు, ఫ్యాషన్, గేమింగ్ తరహాలో కాస్ ప్లే కూడా తన భవిష్యత్ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటుందనడానికి ‘కామిక్ కాన్ 2024’ వంటి ఈవెంట్స్ నిదర్శనంగా నిలుస్తున్నాయని ఈ రంగంలోని నిపుణులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment