రాధేశ్యామ్ తర్వాత ప్రభాస్ స్పీడ్ పెంచాడు. ఇప్పటికే ఆదిపురుష్ షూటింగ్ కంప్లీట్ చేసుకొని.. మరో మూడు సినిమాలను సెట్స్‌పైకి తీసుకొచ్చాడు. ప్రస్తుతం సలార్, ప్రాజెక్ట్ కె, మారుతి సినిమాల షూటింగ్స్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు. వరుస షూటింగ్స్ కారణంగా ప్రభాస్ ఈ మధ్య తరుచూ అనారోగ్యం పాలవుతున్నాడు. జర్వంతో బాధపడుతూ షూటింగ్స్‌కి రాలేకపోతున్నాడు. దీంతో ఆ సినిమా షూటింగ్స్ క్యాన్సిల్ అవుతున్నాయి.
ఆదిపురుష్ టీజర్ లాంచింగ్ సమయంలో ప్రభాస్ మోకాళ్ల ఆపరేషన్ చేయించుకున్నాడు. ఆ తర్వాత నుంచి ప్రభాస్ తరుచూ జ్వరంతో బాధపడుతున్నాడు. రీసెంట్ ఫిబ్రవరిలో కూడా జ్వరం కారణంగా మారుతి సినిమా షూటింగ్ కొన్ని రోజులు క్యాన్సిల్ చేశారు. ఇక డాక్టర్స్ అయితే ప్రభాస్ కొన్నాళ్లపాటు షూటింగ్స్ కి బ్రేక్ ఇవ్వాలని సూచించారట. అయితే ప్రభాస్ తన చేతిలో ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసిన తర్వాత బ్రేక్ తీసుకోవాలని ప్లాన్ చేసుకున్నాడు. కానీ ప్రభాస్ తన ఆరోగ్య సమస్య కారణంగా తీవ్ర ఇబ్బంది పడటంతో ...ట్రీట్ మెంట్ కోసం విదేశాలకు వెళ్లినట్లు తెలుస్తుంది. అయితే అభిమానులు కంగారు పడాల్సిన అవసరం లేదని...జస్ట్ క్యాజువల్ హెల్త్ చెకప్ కోసం వెళ్లినట్లు ప్రభాస్ టీమ్ చెబుతున్న మాట.
అయితే ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ఆఫ్ టాలీవుడ్‌కి సంబంధించి నెట్టింట ఓ వార్త తెగ చక్కర్లు కొడుతోంది. కొన్నాళ్ళ పాటు ప్రభాస్ షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చే అవకాశం ఉందని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తన హెల్త్ కోసం ప్రభాస్ ఈ నిర్ణయం తీసుకున్నాడట. బాహుబలి కోసం బరువు పెరగడం, ఆ తర్వాత తగ్గడం, మధ్యలో సాహో లాంటి భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ చేశాడు ప్రభాస్... ఈ కారణంగా ప్రభాస్ హెల్త్ విషయంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాడనేది టాలీవుడ్ టాక్.
ప్రభాస్ హెల్త్ ఇష్యూ ప్రభావం సలార్ తో పాటు, ప్రాజెక్ట్ కె పై పడే అవకాశాలు ఉన్నాయి. ప్రాజెక్ట్ కె షూటింగ్ లో అమితాబ్ కూడా గాయపడ్డాడు. ఇక ప్రభాస్ తో పాటు అమితాబ్ కోలుకున్న తర్వాతే ప్రాజెక్ట్ కె షూటింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక సలార్ రిలీజ్ కూడా దాదాపు వాయిదా పడే ఛాన్స్ ఉందనే మాట ఫిల్మ్ సర్కిల్ లో వినబడుతోంది. దీంతో తమ అభిమాన హీరో ప్రభాస్ కి ఏమైందనే ఆందోళన ప్రభాస్ ఫ్యాన్స్ లో మొదలైంది. అసలు ప్రభాస్ కి ఏమైంది.? ప్రబాస్ జనరల్ హెల్త్ చెకప్ కోసమే విదేశాలకు వెళ్లాడా? లేదా ట్రీట్ మెంట్ తీసుకునేందుకు వెళ్లాడా? అనే విషయాలు తెలియాలంటే ప్రభాస్ ఫారిన్ కంట్రీ నుంచి తిరిగి వచ్చే వరకు ఆగాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment