ప్రభాస్‌ ‘ప్రాజెక్ట్‌ కె’ నుంచి తొలి అప్‌డేట్‌... మేకింగ్‌ వీడియో చూశారా? | Prabhas Project k Making Video Of Skratch Reinventing The Wheel | Sakshi
Sakshi News home page

Prabhas-Project K: ప్రభాస్‌ ప్రాజెక్ట్‌ కె మేకింగ్‌ వీడియో.. ‘ఆ టైరుతో ఏం చేయబోతున్నారు’

Published Sat, Dec 31 2022 4:41 PM | Last Updated on Sat, Dec 31 2022 4:47 PM

Prabhas Project k Making Video Of Skratch Reinventing The Wheel - Sakshi

పాన్‌ ఇండియ స్టార్‌ ప్రభాస్‌ చేతిలో ప్రస్తుతం పలు భారీ ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. అందులో మోస్ట్‌ అవేయిటెడ్‌ మూవీ ప్రాజెక్ట్‌ కె(Prokect K). మహనటి ఫేం నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో పాన్‌ వరల్డ్‌ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టే ఈ సినిమాలో భారీ తారాగాణం భాగం కానుంది. బాలీవుడ్‌ బ్యూటీ క్వీన్‌ దీపికా పదుకొనె హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్‌ బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అంతేకాదు మరో హీరోయిన్‌ దిశా పటానీ ప్రధాన పాత్రలో కనిపించనుంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్‌ను జరపుకుంటోంది.

చదవండి: తారక్‌ పెద్ద స్టార్‌.. తను అలా చేయాల్సిన అవసరం లేదు, కానీ..!: సీనియర్‌ నటి సుధ

ఈ నేపథ్యంలో మూవీపై మరింత హైప్‌ క్రియేట్‌ చేస్తూ చిత్రం తాజాగా మేకింగ్‌ వీడియోను రిలీజ్‌ చేసింది. స్క్రాచ్‌ ఎపిసోడ్‌ 1: రీఇన్వెంటింగ్‌ ది వీల్‌ అంటూ ఈ వీడియోని వదిలారు. ఇందులో నాగ్‌ అశ్విన్‌ అండ్‌ టీం టైరు తయారు చేస్తూ కనిపిచింది. ఈ టైరు తయారికి టీం అంతా ఎంత కష్టపడిందో​ ఇందులో ఆసక్తిగా చూపించారు. అంతేకాదు మరో ఒక్క టైరు కోసం ఇంత ఓవరాక్షన్‌? అంటూ తమకు తామే సైటర్లు వేసుకోవడం ఆకట్టుకుంది. ఇంతకీ ఈ టైరు కథేంటి? సినిమాలో దాని ప్రాముఖ్యత ఏంటి? అనేది ఆసక్తిని సంతరించుకుంది. ప్రస్తుతం ఈ వీడియో ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంటోంది. 

చదవండి: రష్మికకు రిషబ్‌ శెట్టి గట్టి కౌంటర్‌, ట్వీట్‌ వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement