పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవలే ఆదిపురుష్ చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకున్నప్పటికీ విమర్శల పాలైంది. రామాయణం ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని పలు వివాదాలు చుట్టుముట్టాయి. డైలాగ్స్, పాత్రలతో పాటు సీత ఇండియాలో జన్మించినట్లు చూపించడం వివాదాలకు కేరాఫ్‌గా నిలిచాయి. తొలి మూడు రోజులు వసూళ్లు సాధించినా ఆ తర్వాత పూర్తిగా తగ్గిపోయాయి. ఈ చిత్రం కోసం దాదాపుగా రూ.600 కోట్లు వెచ్చించినట్లు సమాచారం. ప్రభాస్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా ఆదిపురుష్ నిలిచింది.
(ఇది చదవండి: టాలీవుడ్ సినిమాతో ఎంట్రీ.. ఈ ఫోటోలోని హీరోయిన్ ఎవరో తెలుసా?)
ఇక ప్రభాస్ తదుపరి చిత్రం కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఆయన నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ ప్రాజెక్ట్-కెలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, దిశా పటాని లాంటి అగ్రతారలు నటిస్తున్నారు. అంతేకాకుండా సీతారామం స్టార్ దుల్కర్ సల్మాన్ కూడా నటించనున్నట్లు వార్తలొస్తున్నాయి.
అయితే ఇంతటి భారీ తారగణంతో రూపొందుతున్న ఈ చిత్రం బడ్జెట్‌పైనే ఇప్పుడు చర్చ మొదలైంది. ఈ చిత్రంలోని నటీనటులు రెమ్యునరేషన్ ఏ స్థాయిలో ఉంటుందో అర్థమవుతోంది. భారీస్థాయిలో గ్రాఫిక్స్ ఉండనుండడంతో ఈ మూవీ బడ్జెట్ రూ. 600 కోట్లకు పైగానే ఉండనుందని టాక్ వినిపిస్తోంది. అదే గనుక నిజమైతే ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా ప్రాజెక్ట్-కె నిలవనుంది.
ప్రాజెక్ట్-కె రెమ్యూనరేషన్స్
ప్రాజెక్ట్- కె కోసం ప్రభాస్, దీపికా పదుకొనే, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ ఎంత తీసుకుంటున్నారనే దానిపై అభిమానుల్లో చర్చ నడుస్తోంది. ప్రభాస్ ఈ చిత్రం కోసం రూ.150 కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. కమల్ హాసన్ ఈ చిత్రంలో కేవలం అతిథి పాత్రకే రూ.20 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
దీపికా పదుకొణె ఈ చిత్రానికి రూ. 10 కోట్లు వసూలు చేస్తుండగా.. అమితాబ్ బచ్చన్, దిశా పటానీతో కలిపి ఇతరులకు మరో రూ.20 కోట్లు రెమ్యునరేషన్ ఇవ్వనున్నారు. దీంతో కేవలం ప్రాజెక్-కె రెమ్యూనరేషన్ కోసమే దాదాపు రూ.200 కోట్లు వెచ్చించనున్నట్లు సమాచారం.వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 12, 2024న విడుదల కానుంది. తెలుగు, హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.
(ఇది చదవండి: ఆదిపురుష్.. సెన్సార్ బోర్డుపై హైకోర్టు ఫైర్)
Comments
Please login to add a commentAdd a comment