Kamal Haasan Joins Prabhas Project K Pan India Movie - Sakshi
Sakshi News home page

Project K- Kamal Haasan: ప్రభాస్‌తో కమల్.. అలాంటి రోల్‌లో!

Published Sun, Jun 25 2023 12:18 PM | Last Updated on Sun, Jun 25 2023 1:00 PM

Kamal Haasan In Project K Movie - Sakshi

డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న సినిమాలో 'ప్రాజెక్ట్ k' ఒకటి. దీనికి మహానటి ఫేమ్ నాగ్ అశ‍్విన్ కావడంతో అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఎందుకంటే ఇందులో ప్రభాస్ తోపాటు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె లాంటి స్టార్స్ ఉన్నారు. ఇదంతా కాదన్నట్లు భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ స్థాయిలో తీస్తున్నారు. ఇప్పుడీ ప్రాజెక్ట్ లోకి విలక్షణ నటుడు వచ్చాడు.

(ఇదీ చదవండి: ప్రెగ్నెంట్‌ అని తెలిసినా ఆ పనిచేశా: అలియా)

గత కొన్నిరోజుల నుంచి సోషల్ మీడియాలో వినిపించినట్లే 'ప్రాజెక్ట్ K'లో కమల్ హాసన్ ఉన్నారని నిర్మాతలు ప్రకటించారు. ఓ కీలకపాత్రలో ఆయన నటిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే ప్రభాస్ హీరోగా నటిస్తుండగా, కమల్ విలన్ గా చేయబోతున్నారని తెలుస్తోంది. అసలు డైరెక్టర్ నాగ్ అశ్విన్.. కమల్ ని ఏం చెప్పి ఒప్పించారనేది సినిమా రిలీజ్ అయితే గానీ తెలియదు. 

ఏదేమైనా రోజురోజుకీ 'ప్రాజెక్ట్ K'లో భాగమవుతున్న యాక్టర్స్ ని చూస్తుంటే హైప్ ఎక్కడికో వెళ్లిపోతోంది. మరోవైపు వచ్చే సంక్రాంతికి అంటే జనవరి 13న ఈ సినిమాని థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. కానీ అది జరగడం కాస్త కష్టమే అనిపిస్తుంది. దీంతో నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ కి అచ్చొచ్చిన మే 9న 'ప్రాజెక్ట్ K' థియేటర్లలోకి వచ్చే అవకాశముందని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో?

(ఇదీ చదవండి: ఫ్లైట్​లో పోగొట్టుకున్నా.. ప్లీజ్‌ తెచ్చి ఇవ్వండి: ఊర్వశి రౌతేలా)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement