ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న పాన్ ఇండియా చిత్రం 'ప్రాజెక్ట్- కే'. జులై 20న కాలిఫోర్నియాలోని శాన్ డియాగోలో నిర్వహించనున్న ‘శాన్ డియాగో కామిక్–కాన్ 2023’ వేడుకలో 'ప్రాజెక్ట్ కే' ప్రచార చిత్రాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ ఘనత దక్కిన తొలి భారతీయ చిత్రంగా ఇది చరిత్ర సృష్టించనుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకోన్ హీరోయిన్. అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శాన్ డియాగో కామిక్ వేదికపై ఈ సినిమాకు సంబందించిన టైటిల్‌ను రివీల్ చేయనున్నారు. అనంతరం సినిమాకు చెందిన పలు విషయాలను పంచుకోనున్నారు.
(ఇదీ చదవండి: 61 ఏళ్ల వ్యక్తితో శృంగారం.. రియాక్ట్ అయిన హీరోయిన్)
ఇప్పుడు ప్రాజెక్ట్-కే అంటే ఏమిటి? అనే ఆసక్తి అందరిలో పెరిగింది. అంతేకాకుండా మేకర్స్ కూడా ప్రాజెక్ట్-కే అంటే ఏమిటో తెలుసుకోవాలని ఉందా? అంటూ ట్వీటర్‌లో తెగ ఊరిస్తున్నారు. దీంతో ఈ మూవీ టైటిల్ ఇదే అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. మొదట ప్రాజెక్ట్-కే అంటే 'కర్ణ, కల్కీ' అనే పేర్లు వైరల్ అయ్యాయి. కానీ తాజాగా ప్రాజెక్ట్ 'కాలచక్ర' అనే టైటిల్ ఖారారు చేసినట్లు తెలుస్తోంది.
సైన్స్ ఫిక్షన్ - టైమ్ ట్రావెల్ బ్యాక్ డ్రాప్‌గా బేస్ చేసుకుని ఈ సినిమా వస్తుండటంతో 'కాలచక్ర' టైటిల్‌ను ఓకే చేశారని టాక్ నడుస్తుంది. ఈ సస్పెన్స్ వీడాలంటే జులై 20 వరకు ఆగాల్సిందే. శాన్ డియాగో కామిక్ కాన్ వేదికపైన ప్రభాస్, దీపికా పదుకోన్, అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, నాగ్ అశ్విన్ సందడి చేయనున్నారు. ఇకపోతే ఈ సినిమాను 2024 సంక్రాంతికి విడుదల చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.
(ఇదీ చదవండి: బర్త్‌డే కానుకగా భర్తకు 6 అడుగుల గిఫ్ట్ ఇచ్చిన నటి.. వైరల్ వీడియో!)
Comments
Please login to add a commentAdd a comment