
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతున్న మూవీ ‘ప్రాజెక్ట్ కే’. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ భారీ ప్రాజెక్ట్‌లో లోక నాయకుడు కమల్ హాసన్ భాగం కానున్నారనేది ఆ వార్త సారాంశం.
(చదవండి: ఆడ పిల్లనని ముఖమే చూడలేదు..అన్నయ్య చాలా ఇబ్బంది పెట్టాడు: స్నేహ)
అధికారికంగా ఎలాంటి ప్రకటన లేకపోయినా ఒక కీలకమైన పాత్ర కోసం దర్శకుడు నాగ్ అశ్విన్, కమల్‌ని సంప్రదించారట. అయితే కమల్ వెంటనే ఓకే చెప్పకపోయినా.. సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. కేవలం 20 రోజులు కాల్ షీట్స్ ఇస్తే ఆ భాగం పూర్తి చేస్తానని నాగ్ అశ్విన్ చెప్పాడట. అయితే కమల్ పోషించేది విలన్ పాత్రేనని కొంతమంది నెటిజన్స్ అంటున్నారు. మరి ఇందులో వాస్తవమెంత అనేది అధికారిక ప్రకటన వచ్చేవరకు తెలియదు.
ప్రస్తుతం కమల్ ఇండియన్ 2 షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. సెప్టెంబర్ వరకు కమల్ డేట్స్ ఖాలీగా లేవు. ఒకవేళ కమల్ ఒప్పుకుంటే.. సెప్టెంబర్ తర్వాతే ప్రాజెక్ట్ కే సెట్‌లో అడుగుపెడతాడు. మరోవైపు వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రాజెక్ట్ కేని విడుదల చేయాలని వైజయంతి మూవీస్ టార్గెట్‌గా పెట్టుకుంది. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటించింది.
Comments
Please login to add a commentAdd a comment