Is Ram Gopal Varma To Play Special Role In Prabhas Nag Ashwin Movie, Deets Inside - Sakshi
Sakshi News home page

Prabhas-Ram Gopal Varma: ప్రభాస్‌ చిత్రంలో రామ్‌ గోపాల్‌ వర్మ! ఈ పాత్ర ఎలా ఉంటుందో?

Published Sat, Nov 12 2022 12:30 PM | Last Updated on Sat, Nov 12 2022 1:27 PM

Is Ram Gopal Varma Played Special Role in Prabhas Project k Movie - Sakshi

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తరచూ ఏదోక అంశంపై తనదైన శైలిలో కాంట్రవర్సల్‌ కామెంట్స్‌ చేసి వార్తల్లో నిలుస్తుంటాడు. ఇక డైరెక్టర్‌గా హిట్‌, ప్లాప్స్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తు వస్తున్నాడు. యథార్థ సంఘటల నేపథ్యంలో సినిమాలు తెరకెక్కిస్తూ వస్తున్న ఆర్జీవీకి సంబంధించిన ఓ ఆసక్తికర అప్‌డేట్‌ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆయన ఓ పాన్‌ ఇండియా సినిమాలో నటించనున్నట్లు తెలుస్తోంది. అది కూడా అంత్యంత క్రేజ్‌ ఉన్న పాన్‌ ఇండియా హీరో చిత్రంలో... ఆయన ఎవరో కాదు డార్లింగ్‌ ప్రభాస్‌.

చదవండి: నా గ్లామర్‌ ఫొటోలు చూసి ఎంజాయ్‌ చేస్తున్నారు: హీరోయిన్‌ షాకింగ్‌ కామెంట్స్

ప్రభాస్‌ ప్రస్తుతం వరుస పాన్‌ ఇండియా చిత్రాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. అందులో సలార్‌, ప్రాజెక్ట్‌-kలు సెట్‌పై ఉండగా.. ఆది పురుష్‌ నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. మారుతితో మరో ప్రాజెక్ట్‌ను లైన్లో పెట్టాడు. ప్రస్తుతం నాగ్‌ అశ్విన్‌ డైరెక్షన్‌లో చేస్తున్న ప్రాజెక్ట్‌-k ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ను జరుపుకుంటోంది. ఈ సినిమాలోనే ఆర్జీవీ ఓ ముఖ్య పాత్ర పోషించబోతున్నాడట. ఇటీవలే నాగ్ అశ్విన్‌ ఈ మూవీలో ఓ పాత్ర కోసం ఆర్జీవీని సంప్రదించగా.. ఆయనకు కథ నచ్చడంతో  వెంటనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడట. త్వరలోనే ఆయనకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలుస్తుంది. 

చదవండి: భారీగా రెమ్యునరేషన్‌ పెంచేసిన శ్రీలీల? షాకవుతున్న నిర్మాతలు!

దీంతో ఆర్జీవీ రోల్‌పై ఆసక్తి నెలకొంది. ఎప్పుడు భిన్నంగా ఆలోచించే ఆర్జీవీ నచ్చిన ఆ రోల్‌ ఏంటనేది నెటిజన్లు ఆరా తీస్తున్నారు. అంతేకాదు ఆయన పాత్ర ఎలా ఉంటుందో? అంటూ ఆసక్తిని కనబరుస్తున్నారు. అయితే ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియదు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా సై-ఫై థ్రిల్లర్‌ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై అశ్వినీ దత్‌ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు. ప్రభాస్‌కు జోడీగా దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. 2024 సమ్మర్‌లో ఈ సినిమాను రిలీజ్‌ చేసేందుకు మూవీ టీం సన్నాహాలు చేస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement