Prabhas First Look Poster Released From Project K Movie, See Netizens Reactions - Sakshi
Sakshi News home page

Prabhas Project K First Look: ఫస్ట్ లుక్ డిఫరెంట్.. ప్రభాస్ అలా!

Jul 19 2023 3:42 PM | Updated on Jul 19 2023 6:57 PM

Prabhas First Look Project K Movie - Sakshi

డార్లింగ్ ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో 'ప్రాజెక్ట్ K' ఒకటి. ఈ చిత్రంపై ఓ మాదిరిగా అంచనాలున్నప్పటికీ.. సినిమా లవర్స్ మాత్రం గట్టిగానే ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే  డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాబట్టి. ప్రభాస్ లాంటి కటౌట్‌ని పెట్టుకుని సాదాసీదా కథ అయితే తీయడుగా! తాజాగా బుధవారం రిలీజ్ చేసిన ప్రభాస్ ఫస్ట్‌లుక్ చూస్తే అదే అనిపించింది.

(ఇదీ చదవండి: డ్రగ్స్‌ కేసులో హీరోయిన్‌కు బిగ్‌ రిలీఫ్‌)

గత సినిమాలతో పోలిస్తే 'ప్రాజెక్ట్ K' ప్రభాస్ సరికొత్తగా కనిపించాడు. ఒళ్లంతా రోబో లాంటి సూట్ ఉన్నప‍్పటికీ.. పొడవైన జుట్టుతో కనిపించాడు. తన చేతితో భూమిని గుద్దితే, అది బద్దలైనట్లు ఈ ఫొటోలో చూపించారు. దీనిపై అభిమానులు మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చిత్రబృందం అమెరికాలో ఉంది. గురువారం జరిగే కామికాన్ ఈవెంట్ లో టైటిల్ ఏంటనేది రివీల్ చేయనున్నారు.

మన దేశంలో అత్యంత భారీ బడ్జెట్ తో తీస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ తోపాటు దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వైజయంతీ మూవీస్ ఏ మాత్రం ఖర్చుకు వెనకాడకుండా తీస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్లలోకి తీసుకొస్తున‍్నట్లు కొన్నిరోజుల ముందు ప్రకటించారు కానీ రిలీజ్ డేట్ మారే అవకాశాలు గట్టిగానే ఉన్నాయి. 

(ఇదీ చదవండి: Project K: దీపికా పదుకోన్‌ ఫస్ట్‌ లుక్‌ వచ్చేసింది)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement