
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సర్జరీ కోసం విదేశాలకు వెళ్లాడట. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ వెల్లడించాడు. ప్రాజెక్ట్ కె సినిమా గురించి గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన సీతారామం ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ప్రభాస్ ముఖ్య అతిథిగా రావాల్సి ఉంది. కానీ కాలి సర్జరీ కోసం విదేశంలో ఉండటంతో రాలేకపోయాడు అని చెప్పుకొచ్చాడు. కాగా ప్రభాస్‌కు గతంలోనూ సర్జరీ జరిగినట్లు వార్తలు విచ్చిన విషయం తెలిసిందే!
ఇక ప్రాజెక్ట్ కెను వచ్చే ఏడాది అక్టోబర్ 18న ప్లాన్ చేయాలని భావిస్తున్నట్లు అశ్వినీదత్ పేర్కొన్నాడు. ఒకవేళ అప్పటికి కుదరకపోతే 2024 జనవరిలో రిలీజ్ చేస్తామని వెల్లడించాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ప్రభాస్‌కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకోణ్ నటిస్తుండగా బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు.
చదవండి: చైతూతో కలిసి ఉన్న ఇంటినే సమంత ఎక్కువ రేటుకు కొనుక్కుంది
Comments
Please login to add a commentAdd a comment