Kamal Haasan Joins Cast Of Prabhas And Deepika Padukone Starrer Project K, Deets Inside - Sakshi
Sakshi News home page

Kamal Haasan In Project K: ప్రాజెక్ట్‌ కె విషయంలో ఆసక్తిగా ఉన్నాను

Published Mon, Jun 26 2023 3:04 AM | Last Updated on Mon, Jun 26 2023 12:39 PM

Kamal Haasan joins cast of Prabhas, Deepika Padukone starrer Project K - Sakshi

‘‘యాభై ఏళ్ల క్రితం నేను డ్యాన్స్‌ అసిస్టెంట్‌గా, అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేస్తున్నప్పుడు నిర్మాణ రంగంలో అశ్వినీదత్‌ పేరు బాగా వినిపించేది. యాభై ఏళ్ల తర్వాత ఇప్పుడు మేం కలిసి పని చేయబోతున్నాం’’ అన్నారు కమల్‌హాసన్‌. ప్రభాస్, దీపికా పదుకోన్‌ జంటగా అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్రలో వైజయంతీ మూవీస్‌ నిర్మిస్తున్న చిత్రం ‘ప్రాజెక్ట్‌ కె’.

నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రను కమల్‌హాసన్‌ చేయనున్నారనే వార్త కొన్ని రోజులుగా ప్రచారంలో ఉంది. ఈ చిత్రంలో కమల్‌ నటించనున్న విషయాన్ని ఆదివారం చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా కమల్‌హాసన్‌ మాట్లాడుతూ – ‘‘మా తర్వాతి తరానికి చెందిన దర్శకుడి నేతృత్వంలో అదే తరానికి చెందిన కో–స్టార్స్‌ ప్రభాస్, దీపికాతో కలిసి నటించబోతున్నాను.

అమిత్‌ జీ (అమితాబ్‌)తో కలిసి నటించినప్పటికీ ఆయనతో ఎప్పుడు సినిమా చేసినా మొదటిసారిలానే అనిపిస్తుంటుంది. అమిత్‌ జీ ఎప్పటికప్పుడు తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటారు. నేను కూడా ఆ ప్రక్రియను అనుసరిస్తుంటాను. ‘ప్రాజెక్ట్‌ కె’ విషయంలో నేను చాలా ఆసక్తిగా ఉన్నాను. నేను సినిమా అభిమానిని. అందుకే నా పరిశ్రమలో ఏ కొత్త ప్రయత్నం జరిగినా మెచ్చుకుంటాను. అలా ‘ప్రాజెక్ట్‌ కె’ని ప్రశంసించే తొలి వ్యక్తిని నేనే కావాలనుకుంటున్నాను.

మా దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ విజన్‌ మన దేశం, ప్రపంచం మొత్తం మారుమోగుతుందని కచ్చితంగా చెబుతున్నాను’’ అన్నారు. ‘‘నా కెరీర్‌లో 50వ సంవత్సరంలో దిగ్గజ నటులు కమల్‌హాసన్, అమితాబ్‌ బచ్చన్‌లతో కలిసి పని చేసే అవకాశం రావడం అనేది నాకో వరం’’ అన్నారు అశ్వినీదత్‌. ‘‘లెజండ్‌ కమల్‌హాసన్‌ సార్‌తో కలిసి పని చేయడం గౌరవంగా భావిస్తున్నాను. ఆయన్నుంచి నేర్చుకునే అవకాశం రావడం అనేది ఓ కల నెరవేరిన క్షణంలా భావిస్తున్నాను’’ అన్నారు ప్రభాస్‌. ‘‘ఎన్నో విలక్షణ పాత్రలు చేసిన కమల్‌ సార్‌తో కలిసి పని చేయడం గౌరవంగా భావిస్తున్నాను. ఆయన మా చిత్రంలోకి వచ్చి ‘ప్రాజెక్ట్‌ కె’ని సంపూర్ణం చేశారు’’ అన్నారు నాగ్‌ అశ్విన్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement