అమితాబ్ బచ్చన్
ఇక్కడున్న ఫొటో చూశారుగా. ఫొటోలో ఉన్నది బాలీవుడ్ బిగ్ బి అమితాబ్‌బచ్చన్ అంటే ఆశ్చర్యపోరుగా. సుజీత్ సర్కార్ దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్, ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రధారులుగా ‘గులాబో సీతాబో’ అనే సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమాలోని అమితాబ్ బచ్చన్ లుక్ బయటికొచ్చింది. లక్నో నేపథ్యంలో సాగే ఫ్యామిలీ డ్రామా ఇది. ఈ సినిమాలో కోపిష్టి యజమాని పాత్రలో నటిస్తున్నారట అమితాబ్. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు. 2015లో వచ్చిన ‘పీకు’ సినిమా కోసం అమితాబ్, సుజీత్ సర్కార్ కలిసి వర్క్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మళ్లీ వీళ్ల కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ఇదే.
Comments
Please login to add a commentAdd a comment