ముంబై : లాక్‌డౌన్ నేపథ్యంలో సినిమా హాళ్లు మూతపడడంతో కొత్త సినిమాల విడుదలకు అవకాశం లేకుండా పోయింది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకొని విడుదలకు రెడీగా ఉన్న సినిమాల్లో చాలా వరకు అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, సన్ ఎన్‌ఎక్స్‌టీ, ఓటీటీ ద్వారా డైరెక్ట్‌గా టీవీల ముందు ప్రత్యక్షమవుతున్నాయి. తాజాగా అమితాబ్ బచ్చన్, ఆయుష్మాన్ ఖురానాలు నటించిన 'గులాబో సితాబో' సినిమాను అమెజాన్ ఫ్రైమ్ ద్వారా విడుదల చేయనున్నట్లు ఆ చిత్ర నిర్మాణ బృందం ప్రకటించింది. ఈ చిత్రంలో గులాబో అనే వృద్ధుడి పాత్రలో అమితాబ్ నటిస్తుండగా, సితాబో పాత్రలో ఆయుష్మాన్ ఖురానా నటిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 17న థియోటర్లలోకి రావాల్సింది. అయితే కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ విధించడంతో సినిమా థియేటర్స్ మూతపడ్డాయి. జూన్ 12 నుంచి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో ప్రత్యక్షం కానుంది. గులాబో సితాబో సినిమాను రోన్ని లాహిరి, షీల్ కుమార్‌లు నిర్మించగా షూజిత్ సిర్కార్ దర్శకత్వం వహించారు.
Comments
Please login to add a commentAdd a comment