పవన్కి విలన్గా సూర్య ఫ్రెండ్ | Ajay plays villain in Pawan Kalyans upcoming SJ Surya Film | Sakshi
Sakshi News home page

పవన్కి విలన్గా సూర్య ఫ్రెండ్

Published Thu, Jun 16 2016 10:05 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

పవన్కి విలన్గా సూర్య ఫ్రెండ్ - Sakshi

పవన్కి విలన్గా సూర్య ఫ్రెండ్

చత్రపతి, విక్రమార్కుడు సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అజయ్, ఆ తరువాత ఆకట్టుకునే పాత్రల్లో కనిపించలేదు. ముఖ్యంగా టాలీవుడ్లో అజయ్ తరహా పాత్రలు చేసే నటీనటులు చాలా మంది ఉండటంతో పెద్దగా వెండితెర మీద కనిపించలేదు. అయితే ఇటీవల ఓ గోల్డెన్ ఛాన్స్తో వెండితెర మీద సత్తా చాటిన ఈ యువ నటుడు ఇప్పుడు భారీ ఆఫర్స్తో దూసుకుపోతున్నాడు.

సూర్య హీరోగా తెరకెక్కిన 24 సినిమాలో విలన్ పాత్రకు నమ్మకస్తుడైన అనుచరుడు మిత్రాగా నటించాడు అజయ్. సినిమా అంతా కనిపించే కీలక పాత్రలో నటించిన అజయ్ తెలుగుతో పాటు తమిళ ఆడియన్స్నూ మెప్పించాడు. అదే జోరులో ఇప్పుడు టాలీవుడ్లో కూడా ఓ స్టార్ హీరో సినిమాలో నెగెటివ్ రోల్లో కనిపించబోతున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఎస్జె సూర్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కోసం అజయ్ను విలన్గా ఎంపిక చేశారు. ఈ సినిమా రిలీజ్ తరువాత తనకు మరిన్ని అవకాశాలు వస్తాయన్న నమ్మకంతో ఉన్నాడు అజయ్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement