రేణు దేశాయ్ తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసిన ఓ ఫోటో ఇప్పడు హల్చల్ చేస్తోంది. తమిళ దర్శకుడు, హీరో ఎస్జె సూర్యతో కలిసి లంచ్ చేస్తున్న ఫోటోను ఆమె తన ట్విట్టర్లో పోస్టు చేసి అభిమానులతో పంచుకున్నారు. 'న్యూ ఇయర్ లంచ్ విత్ సూర్య సార్' అంటూ రేణు దేశాయ్ ట్విట్ చేసింది. కొడుకు అఖీరా, కూతురు ఆద్య ...ఈ ఫోటో తీసారంటూ ఆమె పేర్కొంది. అంతకు ముందు రేణు దేశాయ్ నూతన సంవత్సరం సందర్భంగా అందరికీ హృదయ పూర్వక నూతన వత్సర శుభాకాంక్షలు అని ట్విట్టర్లో తెలిపింది.
New year lunch with Surya sir...:) pic clicked by Akira &Aadya hiding behind me :D pic.twitter.com/Af5hSPSoPx
— renu (@renuudesai) January 1, 2016
కాగా పవన్ కళ్యాణ్ కెరీర్ను మలుపు తిప్పిన సూపర్ హిట్ సినిమా ఖుషి. తమిళ దర్శకుడు ఎస్జె సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ అప్పట్లో సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'కొమరం పులి' అనుకున్నంత విజయం సాధించలేదు. ఈ సినిమా పవన్ కెరీర్లోనే బిగెస్ట్ డిజాస్టర్ అనిపించుకోవటంతో ఎస్ జె సూర్య పూర్తిగా తెలుగు సినిమాలకు దూరమయ్యాడు. ఈ సినిమా తరువాత సూర్య తమిళ్లో చేసిన సినిమాలు కూడా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. వరుస ఫ్లాప్లతో కష్టాల్లో పడ్డ ఎస్జె సూర్యకు మరో ఛాన్స్ ఇచ్చే ఆలోచనలో ఉన్నాడట పవర్ స్టార్. దీంతో ఈ ఇద్దరి కాంబినేషన్లో ఖుషి సినిమాకు సీక్వెల్ తెరకెక్కనుందన్న టాక్ వినిపిస్తోంది.