నటుడు విశాల్‌కు ఒక హిట్ అవసరం ఎంతైనా ఉంది. ఆయన సమీపకాలంలోని చిత్రాలు ఆశించిన విజయం సాధించలేదు. కాగా తాజాగా 'మార్క్ ఆంటోనీ' చిత్రంతో రావడానికి సిద్ధమయ్యారు. ఇందులో ఎస్ జే.సూర్య ప్రతినాయకుడిగా నటించారు. విశాల్, ఎస్‌జే.సూర్య ఇద్దరు ద్విపాత్రాభినయం చేయడం విశేషం. మార్క్‌ఆంటోనీ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 15న పాన్ ఇండియా స్థాయిలో తమిళం, తెలుగు హిందీ భాషల్లో విడుదలకు ముస్తాబవుతోంది. ఇలాంటి సమయంలో సినిమా విడుదలను ఆపేయాలని మద్రాసు కోర్టు తీర్పు వెల్లడించింది.
ఏం జరిగిందంటే
నటుడు విశాల్ చిత్ర నిర్మాణ సంస్థ అయిన విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పేరుతో అన్బుచెజియన్‌కు చెందిన గోపురం ఫిల్మ్స్ నుంచి రూ. 21.29 కోట్ల రూపాయల రుణాన్ని తీసుకున్నాడు. తిరిగి చెల్లించడంలో ఆయన విఫలం కావడంతో విశాల్‌ను నమ్మి ఆ రుణాన్ని లైకా ప్రొడక్షన్ చెల్లించింది. ఈ విషయంలో, విశాల్, లైకా మధ్య ఒప్పందం ప్రకారం, మొత్తం రుణం తిరిగి చెల్లించే వరకు విశాల్ ఫిల్మ్ కంపెనీకి చెందిన అన్ని చిత్రాల హక్కులను లైకాకు ఇస్తామని హామీ ఇచ్చారు.
(ఇదీ చదవండి: శివాజీతో చేతులు కలిపిన షకీలా, అర్ధరాత్రి డ్రామాలు.. ఆగమైన కంటెస్టెంట్లు)
ఈ స్థితిలో రుణం చెల్లించకుండా గ్యారెంటీని ఉల్లంఘించి ‘వీరమే వాగై చూడుమ్’ (సామాన్యుడు) సినిమా విడుదలపై నిషేధం విధించాలని లైకా సంస్థ మద్రాసు హైకోర్టులో గతంలో కేసు వేసింది. ఈ వ్యాజ్యాన్ని విచారించిన మద్రాస్ హైకోర్టు విశాల్‌కు పలు సూచనలు ఇచ్చింది. హైకోర్టు రిజిస్ట్రార్ పేరిట 15 కోట్ల రూపాయలను శాశ్వత డిపాజిట్‌గా బ్యాంకులో డిపాజిట్ చేసి ఆస్తుల వివరాలను సమర్పించాలని నటుడు విశాల్‌ను ఆదేశించింది.
దీంతో సింగిల్ జడ్జి ఆదేశాలపై ద్విసభ్య ధర్మాసనంలో విశాల్ అప్పీల్ దాఖలు చేశారు. చీఫ్ జస్టిస్ రాజా, జస్టిస్ భరత చక్రవర్తితో కూడిన ధర్మాసనం ఈ అప్పీల్‌ను విచారించి, విశాల్ కోర్టుకు రూ.15 కోట్లు చెల్లించాలన్న ఆదేశాలను సమర్థించింది. చెల్లించని పక్షంలో, సింగిల్ జడ్జి ముందు ఈ కేసులో తీర్పు వెలువడే వరకు విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ నిర్మించిన చిత్రాలను థియేటర్లలో లేదా OTT సైట్‌లలో విడుదల చేయడంపై నిషేధం విధించి అప్పీల్ కేసును ముగించారు.
(ఇదీ చదవండి: అట్లీ, షారుఖ్‌పై నయనతార అసంతృప్తి.. నిజమెంత?)
ఇదిలా ఉంటే, విశాల్ చిత్రం 'మార్క్ ఆంటోని' సెప్టెంబర్ 15 న ప్రేక్షకుల ముందుకు రానుంది, ఈ కేసు ఈరోజు మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి ఆశా ముందు విచారణకు వచ్చింది. అప్పట్లో కేసును విచారించిన న్యాయమూర్తి హైకోర్టు ఆదేశాల మేరకు రూ.15 కోట్లు డిపాజిట్ కాకపోవడంతో విశాల్ కొత్త సినిమాపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవలే 'మార్క్ ఆంటోనీ' సినిమా ట్రైలర్ ఇంటర్నెట్‌లో విడుదలై మిలియన్ వ్యూస్‌ను దాటడం గమనార్హం. రెండు గంటల 30 నిమిషాలు నిడివి కలిగిన ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూఏ సర్టిఫికెట్ ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment