హీరో విశాల్ తన ఆస్తులు, బ్యాంకు ఖాతాల వివరాలను కోర్టులో సమర్పించారు. దీనికి సంబంధించిన వివరాలను చూస్తే నటుడు విశాల్ ఫైనాన్షియర్ అన్బచెలియన్ వద్ద తీసుకున్న రూ.21.29 కోట్ల రుణాన్న లైకా సంస్థ చెల్లించింది. అందుకు గానూ విశాల్ నిర్మించే చిత్రాల హక్కులను తమకు చెందే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే విశాల్ కథానాయకుడిగా నటించి, నిర్మించిన వీరమే వాగై చుడుమ్ చిత్ర విడుదల హక్కులను లైకాకు బదులుగా వేరే సంస్థకు విక్రయించారు. దీంతో లైకా సంస్థ చైన్నె హైకోర్టును ఆశ్రయించింది.
ఈ కేసుపై చైన్నె హైకోర్టు ప్రత్యేక న్యాయస్థానంలో పలు మార్లు విచారణ జరిగింది. గత 12వ తేదీన ఈ కేసును విచారించిన న్యాయమూర్తి పీటీ ఉషా విశాల్‌ను తన స్థిరాస్తులు, బ్యాంక్ ఖాతాల వివరాలను కోర్టుకు సమర్పించాలని ఆదేశించించారు. కానీ ఈ ఆదేశాలను పాటించకపోవడంతో గత 19వ తేదీన జరిగిన విచారణ సమయంలో దీన్ని కోర్టు ధిక్కరణ కింద పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కాగా ఈ కేసు సోమవారం మరోసారి విచారణకు వచ్చింది.
ఈ సందర్భంగా విశాల్ తన ఆస్తుల వివరాలను కోర్టుకు అందించారు. అందులో స్టాండర్డ్ చార్టెడ్, ఐడిబీఐ, యాక్సెస్, హెచ్ డీ ఎఫ్ సీ, బ్యాంక్ ఆఫ్ ఇండియా తదితర బ్యాంకుల్లోని తన ఖాతాల వివరాలను పొందుపరిచారు. అయితే ఆ వివరాలు పూర్తిగా లేకపోవడంతో రిట్ పిటిషన్ దాఖలు చేయాల్సిందిగా లైకా సంస్థను ఆదేశించిన న్యాయమూర్తి తదుపరి విచారణను ఈనెల 26కు వాయిదా వేశారు.
చదవండి: ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న చిత్రం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Comments
Please login to add a commentAdd a comment