ఇది మూవీ షూటింగ్‌ కాదు, సరిగ్గా ఆన్సరివ్వు: విశాల్‌పై మండిపడ్డ కోర్టు | Vishal Says He Signed Empty Paper over Lyca Productions Case | Sakshi
Sakshi News home page

ఖాళీ కాగితంపై సంతకం చేశానన్న హీరో.. సరైన సమాధానం కావాలన్న కోర్టు

Published Fri, Aug 2 2024 12:55 PM | Last Updated on Fri, Aug 2 2024 2:55 PM

Vishal Says He Signed Empty Paper over Lyca Productions Case

చెన్నై: కోలీవుడ్‌ హీరో విశాల్‌పై న్యాయస్థానం మండిపడింది. విశాల్‌కు, ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్‌కు మధ్య కొన్నాళ్ల క్రితం డబ్బు విషయంలో విభేదాలు తలెత్తాయి. దీనిపై లైకా సంస్థ కోర్టును ఆశ్రయించింది. కేసు విచారణలో భాగంగా విశాల్‌ కోర్టుకు హాజరయ్యాడు. తాను ఖాళీ కాగితంపై సంతకం చేశానని, లైకా సంస్థతో అగ్రిమెంట్‌ జరిగిందన్న విషయమే తెలియదన్నాడు. అతడి వ్యాఖ్యలపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలివిగా సమాధానం చెబుతున్నారనుకుంటున్నారా? ఇదేం షూటింగ్‌ కాదు. సరిగ్గా బదులివ్వండి అని గద్దించి అడిగారు.

కాగా విశాల్‌.. ఫైనాన్షియర్‌ అన్బచెలియన్‌ దగ్గర తీసుకున్న రూ.21.29 కోట్ల రుణాన్ని లైకా సంస్థ చెల్లించింది. అందుకుగానూ ఆ డబ్బు తిరిగిచ్చేవరకు విశాల్‌ నిర్మించే సినిమా హక్కుల్ని తమకు చెందే విధంగా ఒప్పందం కుదుర్చుకుంది. అయితే విశాల్‌.. వీరమె వాగై చూడమ్‌ అనే సినిమా హక్కుల్ని లైకాకు బదులు వేరే సంస్థకు విక్రయించాడు. దీంతో రెండేళ్లక్రితం లైకా సంస్థ చెన్నై హైకోర్టును ఆశ్రయించింది. అప్పటి నుంచి ఈ కేసు విచారణ కొనసాగుతూనే ఉంది.

చదవండి: కోట్లు ఇచ్చినా బిగ్‌బాస్‌కు వెళ్లనన్న బ్యూటీ.. వెనక్కు తగ్గిందా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement