కోట్లు ఇచ్చినా బిగ్‌బాస్‌కు వెళ్లనన్న బ్యూటీ.. వెనక్కు తగ్గిందా? | Anchor Vishnu Priya About Bigg Boss 8 Telugu Entry Rumours | Sakshi
Sakshi News home page

అదే జరిగితే బిగ్‌బాస్‌లో నన్ను చూస్తారు: విష్ణుప్రియ

Aug 2 2024 10:34 AM | Updated on Aug 2 2024 10:52 AM

Anchor Vishnu Priya About Bigg Boss 8 Telugu Entry Rumours

యాంకర్‌, నటి విష్ణుప్రియ బిగ్‌బాస్‌ షోలో అడుగుపెడుతుందని ప్రతి ఏడాది రూమర్లు వస్తూనే ఉంటాయి. అయితే ఈసారి ప్రచారం కాస్త ఊపందుకుంది. తెలుగు బిగ్‌బాస్‌ ఎనిమిదో సీజన్‌లోకి విష్ణుప్రియ ఎంట్రీ ఇవ్వడం ఖాయమని నెట్టింట ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ ఊహాగానాలపై విష్ణుప్రియ స్పందించింది.

అదే జరిగితే బిగ్‌బాస్‌లో ఉంటా
ఆమె మాట్లాడుతూ.. బిగ్‌బాస్‌కు వెళ్తే నేను పది కిలోల బరువు తగ్గుతానన్న నమ్మకముంది. నిజానికి నాకు బిగ్‌బాస్‌ షోకు వెళ్లడం అస్సలు ఇష్టం లేదు. కానీ ఎందరో ప్రేక్షకుల దీవెనల వల్ల రియాలిటీ షోలో అడుగుపెడతానేమోనని భయమేస్తోంది. చాలామంది నన్ను ఆ షోలో చూడాలనుకుంటున్నారు. వారి కోరికలు విని తథాస్తు దేవతలు తథాస్తు అంటే కచ్చితంగా మీరు నన్ను బిగ్‌బాస్‌లో చూస్తారు అని చెప్పింది. అక్కడే ఉన్న రీతూ చౌదరి సైతం.. నాది కూడా విష్ణుప్రియలాంటి పరిస్థితే అని పేర్కొంది.

జీవితంలో వెళ్లను
కాగా విష్ణుప్రియ గతంలో ఓ ఇంటర్వ్యూలో ఎన్ని కోట్లు ఇచ్చినా సరే నా జీవితంలో బిగ్‌బాస్‌కు వెళ్లను అని చెప్పింది. బయట ప్రపంచం ఇంత అందంగా ఉన్నప్పుడు ఆ హౌస్‌లోకి వెళ్లాల్సిన అవసరమేంటని ప్రశ్నించింది. చిన్నప్పటినుంచి బిగ్‌బాస్‌ చూడలేదని, దానిపై అంత ఆసక్తి లేదంది. పైగా అందులోని గొడవలు, ఎలిమినేషన్‌ తనకసలు నచ్చవంది.

చదవండి: Kalki 2898 AD: గుడ్‌ న్యూస్‌.. చవక రేటుకే కల్కి టికెట్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement