Kalki 2898 AD: గుడ్‌ న్యూస్‌.. చవక రేటుకే కల్కి టికెట్స్‌ | Kalki 2898 AD: Makers Announce Tickets Price Drop | Sakshi
Sakshi News home page

ఇంతవరకు కల్కి చూడలేదా? అయితే ఈ గుడ్‌ న్యూస్‌ మీ కోసమే..

Aug 2 2024 8:00 AM | Updated on Aug 2 2024 9:18 AM

Kalki 2898 AD: Makers Announce Tickets Price Drop

కొన్ని సినిమాలు అరుదుగా వస్తుంటాయి. అలాంటి చిత్రమే కల్కి 2898 ఏడీ. ప్రభాస్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ సైన్స్‌ ఫిక్షన్‌ మూవీ జూన్‌ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మౌత్‌ టాక్‌తోనే పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకున్న మూవీ భారత్‌లోనే కాకుండా ఓవర్‌సీస్‌లోనూ కలెక్షన్లతో విజృంభించింది. ఫలితంగా ఇప్పటివరకు రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

టికెట్‌ రేట్ల తగ్గింపు
ఇంత మంచి ఆదరణ లభించడంతో చిత్రయూనిట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వారం కల్కి సినిమాను తక్కువ ధరకే థియేటర్లలో అందుబాటులో ఉంచాలని డిసైడ్‌ అయింది. ‍కల్కిని కేవలం రూ.100కే ఆస్వాదించండి. ఆగస్టు 2 నుంచి 9 వరకు ఇండియా అంతటా ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుందని నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్‌ ఎక్స్‌ మీడియా వేదికగా వెల్లడించింది. ఇప్పటివరకు కల్కి చూడనివారికి, మరోసారి సినిమా చూసి ఎంజాయ్‌ చేయాలనుకునేవారికి ఇది శుభవార్తే అవుతుంది.

కల్కి మూవీ..
కాగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దీపికా పదుకొణె, దిశా పటానీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందించాడు. ఈ చిత్రాన్ని వైజయంతీ బ్యానర్‌పై అశ్వినీదత్‌ తన కుమార్తెలు స్వప్న, ప్రియాంకలతో కలిసి నిర్మించాడు.

 

చదవండి: నా బిడ్డ ఎంత నరకం అనుభవించిందో.. బోరున విలపించిన గీతూరాయల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement