
RC 15 Movie: శంకర్, రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ఇప్పుడు టాలీవుడ్‌ని షేక్ చేస్తుంది. ఈ సినిమాలో నటించే ప్రతినాయకుడి గురించే ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. ఒకప్పటి స్టార్ డైరెక్టర్ ఎస్ జే సూర్య.. రామ్ చరణ్ మూవీలో విలన్ రోల్ చేస్తున్నాడట. స్పైడర్, అదిరింది,మనాడు చిత్రాల్లో హీరోయిజంతో పాటు విలనిజం కూడా బాగా ఎలివేట్ అయింది. ప్రతినాయకుడి పాత్రలో ఒకప్పటి స్టార్ డైరెక్టర్ ఎస్ జే సూర్య నటించిన తీరు ప్రేక్షకుల్ని అబ్బురపరిచింది. తాజాగా చెర్రీ సినిమాలో విజల్ పాత్ర పోషించేందుకు సూర్య ఒప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
శంకర్ మేకింగ్ లో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రంలో ఎస్ జే సూర్య విలన్ రోల్ చేయడం ఆసక్తికరంగా మారింది. చాలా కాలం శంకర్ పవర్ ఫుల్ పొలిటికల్ థ్రిల్లర్ నరేట్ చేయబోతున్నాడని,ఈ సినిమాలో ఎస్ జే సూర్య ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తున్నాడని కోలీవుడ్ టాక్.
Comments
Please login to add a commentAdd a comment