
తమిళసినిమా: ధనుష్ ఈ పేరు ఒక్క తమిళ్ చిత్రం కాదు టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ పరిశ్రమలకు సుపరిచితమే. ఇటీవల ఈయన కథానాయకుడిగా నటించిన నానే వరువేన్ చిత్రం నిరాశపరిచినా, తగ్గేదేలే అన్నట్టుగా ధనుష్ వరుసగా చిత్రాలను చేసుకుంటూ పోతున్నారు. ప్రస్తుతం చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్న నటుల్లో ఈయన ఒకరు. ప్రస్తుతం ఈయన తమిళం, తెలుగు భాషల్లో నటిస్తున్న వాత్తి (తెలుగులో సార్) చిత్రం. నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఫిబ్రవరి 17న విడుదలకు ముస్తాబవుతోంది.
కాగా దీంతో పాటు సత్యజ్యోతి ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తున్న కెప్టెన్ మిల్లర్ చిత్రంలో నటిస్తున్నారు. అరుణ్ మాదేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం స్వాతంత్య్రానికి ముందు జరిగిన సంఘటనతో కూడిన కథా చిత్రంగా ఉంటుందని చిత్ర వర్గాలు వెల్లడించారు. వీరితోపాటు తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ ఒక చిత్రంలో నటించనున్నారు. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇప్పటికే జరిగాయి. నటుడు ధనుష్ ఇప్పుడు మరో క్రేజీ చిత్రానికి సిద్ధమవుతున్నారనేది తాజా సమాచారం.
ఇందులో నలుగురు హీరోలతో కలిసి నటించి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇందులో నటుడు ధనుష్‌తో పాటు విష్ణు, ఎస్.జే.సూర్య, కాళిదాస్ జయరాం నలుగురు హీరోలు నటించనున్నట్లు సమాచారం. ఈ క్రేజీ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి రాయన్ అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు టాక్. ఇది చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇప్పటికే మొదలైనట్లు, త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment