దేవుడా.. అసలేం జరిగింది: రెజీనా | Regina Unhappy With Her Bollywood Debut | Sakshi
Sakshi News home page

దేవుడా.. అసలేం జరిగింది: రెజీనా

Published Fri, Aug 19 2016 6:31 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

దేవుడా.. అసలేం జరిగింది: రెజీనా - Sakshi

దేవుడా.. అసలేం జరిగింది: రెజీనా

తెలుగులో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న రెజీనా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. అది కూడా అమితాబ్ బచ్చన్, అనిల్ కపూర్, అర్జున్ రాంపాల్, అర్షద్ వార్సీలాంటి టాప్ స్టార్స్ నటిస్తున్న సినిమాలో ఆమెకు అవకాశం రావడం విశేషం. ఆంఖే సినిమాకు సీక్వెల్గా వస్తున్న ఆంఖే-2 లో రెజీనా మెరవబోతుంది. ఈ అవకాశం తాను ప్రయత్నించింది కాదని, ఇతర సినిమాల్లో తన నటన చూసి స్వయంగా ఆంఖే-2 టీం తనను అప్రోచ్ అయ్యారంటూ రెజీనా సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది. షూటింగ్ కు ఇంకా సమయం ఉంది కాబట్టి.. ఈలోపు హిందీలో పట్టు సాధించి సొంత డబ్బింగ్ చెప్పుకుంటానని అంటోంది.

కాగా ఆ వేడుకకు రెజీనా వేసుకొచ్చిన బ్లాక్ డ్రెస్ ఆమెకు తలనొప్పులు తీసుకొచ్చి పెట్టింది. నలుపు రంగు డిజైనర్ దుస్తుల్లో రెజీనా మెరిసినా, ఆ డ్రెస్ ఆమెను ఇబ్బందుల్లో పడేసింది. ఆమె స్టేజ్పై డ్యాన్స్ చేస్తున్న సమయంలో ఆ దుస్తులు మరింత కురచగా అయిపోయి అతిధులను సైతం ఇబ్బంది పెట్టాయి. చుట్టూ ఉన్న కెమెరాలు వరుసపెట్టి క్లిక్ మనిపించాయి. విషయం గమనించినా ఆమె తన డ్యాన్స్ను కొనసాగించింది. ఇక అప్పటినుంచి ఆమె డ్రెస్ పై సోషల్ మీడియాలో కామెంట్లు చెలరేగిపోయాయి.

చివరకు ఈ విషయంపై రెజీనా స్పందించింది. స్టేజ్ దిగిన వెంటనే 'దేవుడా.. అసలేం జరిగింది' అని ఆందోళనకు గురైందట. తన బాలీవుడ్ ఎంట్రీకి సంబంధించిన కార్యక్రమంలో ఇలా జరగడం బాధాకరమంటూ వాపోయింది. అయితే అక్కడున్న టీం అంతా తనకు ఎంతో సహకరించారని, ఇలాంటి పొరపాట్లు జరగడం సాధారణమేనని తనకు ధైర్యం చెప్పారని తెలిపింది. ఇక జరిగింది వదిలేసి ముందుకెళ్లాలని తనకు తాను చెప్పుకున్నానని తెలిపింది రెజీనా. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement