ప్రేక్షకులతోనే భయమంతా! | Regina in Aankhen- 2 | Sakshi
Sakshi News home page

ప్రేక్షకులతోనే భయమంతా!

Published Sat, Feb 4 2017 11:20 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

ప్రేక్షకులతోనే భయమంతా! - Sakshi

ప్రేక్షకులతోనే భయమంతా!

‘ఎ’ ఫర్‌ అమితాబ్‌ బచ్చన్‌. బాలీవుడ్‌లో అంతే మరి! యాక్టింగ్‌లో ఆయన తర్వాతే ఎవరైనా. అమితాబ్‌ తర్వాత ‘ఎ’ ఫర్‌... అనిల్‌కపూర్, అర్షద్‌ వార్సి, అర్జున్‌ రాంపాల్‌ పేర్లు రాసుకోవచ్చు. వీళ్లందరూ కూడా నటనలో తక్కువేం కాదు. అనీస్‌ బజ్మీ దర్శకత్వంలో రూపొందనున్న ‘ఆంఖే–2’లో రెజీనా ఈ బాలీవుడ్‌ మహామహులతో నటించనున్నారు.

హిందీ తెరకు పరిచయమవుతున్న తొలి సినిమాలో అమితాబ్‌ వంటి స్టార్‌తో పాటు హేమాహేమీలతో కలసి నటించడానికి నెర్వస్‌గా ఫీలవుతున్నారా? అని రెజీనాని అడిగితే... ‘‘అమితాబ్‌ అయినా మరొకరైనా... నేను నెర్వస్‌గా ఫీలవను. నా భయమంతా ప్రేక్షకులతోనే. హిందీలో నా మొదటి సినిమా కదా! ప్రేక్షకులతో పాటు అక్కడి మీడియా ఎలా రిసీవ్‌ చేసుకుంటుందోనని భయపడుతున్నా. అందుకే కొంచెం నెర్వస్‌గా ఫీలవుతున్నా’’ అన్నారు. తెలుగులో కృష్ణవంశీ ‘నక్షత్రం’లో రెజీనా నటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement