'నా రూట్స్ ఇక్కడే.. అలా ఊహించుకోలేను'
ముంబయి: తాను ఎప్పటికీ దక్షిణాది స్టార్నేనని ప్రముఖ నటి రెజీనా చెప్పింది. ఆంఖేన్ 2 చిత్రం ద్వారా బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్న ఆమె ఇక దక్షిణాధి చిత్రాలకు వీడ్కోలు చెప్పినట్లే అని ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో రెజీనా వివరణ ఇచ్చింది. ఇటు దక్షిణాదిలో అటు బాలీవుడ్ లో సమస్థాయిలో రానిస్తానన్న నమ్మకం తనకు ఉందని చెప్పింది.
బాలీవుడ్ చిత్రాలకోసం దక్షిణాదిని వదిలేయడాన్ని తాను ఊహించుకోలేనని, అసలు అలా ఆలోచించనని చెప్పింది. 'నేను రెండు ఇండస్ట్రీల్లో పనిచేసేందుకు సమయం కేటాయిస్తాను. దక్షిణాదిని వదిలేస్తానని నేను అస్సలు అనుకోను. అవకాశాల రీత్యా నేను ఎక్కడి వరకైనా వెళ్లి ఉండొచ్చు. కానీ నా మనుగడ మాత్రం ఇక్కడే. నా రూట్స్ ఇక్కడే(దక్షిణాదిలో) ఉన్నాయి' అని ఆమె చెప్పింది. అదే సమయంలో తాను నటించనున్న బాలీవుడ్ చిత్రం ఆంఖేన్ 2 గురించి మాట్లాడుతూ పెద్ద స్లార్లతో నటించడం తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పింది.