మరో పవర్ఫుల్ పాత్రలో శివగామి | Ramya krishna role in nara rohit regina Film | Sakshi
Sakshi News home page

మరో పవర్ఫుల్ పాత్రలో శివగామి

Published Sun, Jul 9 2017 12:12 PM | Last Updated on Wed, Aug 29 2018 3:53 PM

మరో పవర్ఫుల్ పాత్రలో శివగామి - Sakshi

మరో పవర్ఫుల్ పాత్రలో శివగామి

బాహుబలి సినిమాలో శివగామి పాత్రలో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారిన రమ్యకృష్ణ, మరో ఆసక్తికరమైన పాత్రలో ప్రేక్షకుల ముందుకు రానుంది. నారా రోహిత్, రెజినా జంటగా పవన్ మల్లెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో రమ్యకృష్ణ రాజకీయనాయకురాలి పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలో టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

బాహుబలి సినిమాలో శివగామి పాత్ర ఎంత కీలకమో ఈ సినిమాకు రమ్యకృష్ణ పాత్ర అంతేకీలకమంటున్నారు చిత్రయూనిట్. ముఖ్యంగా నారా రోహిత్, రమ్యకృష్ణల మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయన్న నమ్మకంతో ఉన్నారు. నారా రోహిత్ పుట్టిన రోజైన జూలై 25న ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement