
బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న రెజీనా
సౌత్లో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న భామలందరూ బాలీవుడ్లో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇక్కడ టాప్ స్టార్స్గా ఉన్న శృతిహాసన్, తమన్నా, కాజల్, ఇలియానా లాంటి చాలా మంది హీరోయిన్లు బాలీవుడ్లో అడుగుపెట్టారు. అయితే సక్సెస్ సాధించిన వారు మాత్రం చాలా తక్కువ. ఇక్కడ టాప్ స్టార్స్గా ఉన్న వారికే బాలీవుడ్లో అవకాశాలు రావటం కష్టంగా ఉంటే.. ఇక్కడ కూడా స్టార్ ఇమేజ్ కోసం కష్టపడుతున్న ఓ భామ బాలీవుడ్ చాన్స్ కొట్టేసింది.
తెలుగులో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నా, స్టార్ ఇమేజ్ మాత్రం అందుకోలేకపోతున్న తెలుగమ్మాయి రెజీనా బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతోంది. అది కూడా అమితాబ్ బచ్చన్, అనీల్ కపూర్, అర్జున్ రామ్పాల్, అర్షద్ వార్సీ లాంటి టాప్ స్టార్స్ నటిస్తున్న సినిమాతో కావటం మరో విశేషం. ఆంఖేన్ సినిమాకు సీక్వల్గా తెరకెక్కుతున్న ఆంఖేన్ 2తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది రెజీనా. ఇప్పటికే ఈ సినిమాలో ఒక హీరోయిన్గా ఇలియానాను తీసుకోగా, నెగెటివ్ షేడ్స్ ఉన్న మరో హీరో్యిన్ పాత్రకు రెజీనాను ఫైనల్ చేశారు. రెజీనా జనవరి నుంచి ఈ సినిమా షూటింగ్లో పాల్గొననుంది.