సౌమ్య, పల్లవి, నివేదిత, శోభు యార్లగడ్డ, రాజమౌళి, అజిత్ ఠాగూర్
‘‘హారర్ జానర్లో రెండు టైప్స్. ఒకటి ఐడియాతో భయపెట్టడం. మరోటి సడన్‌గా ఎవరో వెనకనుంచి రావడం లేదా సౌండ్‌తో భయపెట్టడం. నాకు ఐడియాతో భయపెట్టడం ఇష్టం. ‘అన్యా’స్ ట్యుటోరియల్ చూసినవారు ఎందుకు మాయం అవుతున్నారనే ఐడియా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. పల్లవి, సౌమ్యల ఫ్రెష్ వర్క్, కొత్త ఐడియాలజీ, ఉత్సాహం బాగున్నాయి’’ అన్నారు దర్శకుడు రాజమౌళి. రెజీనా, నివేదితా సతీష్ ముఖ్య తారలుగా పల్లవి గంగిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన వెబ్ సిరీస్ ‘అన్యా’స్ ట్యుటోరియల్’.
ఆర్కా మీడియా, ఆహా నిర్మించిన ఈ సిరీస్ జూలై 1 నుంచి తెలుగు, తమిళ భాషల్లో ‘ఆహా’ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా జరిగిన ఈ వెబ్‌సిరీస్ ట్రైలర్ లాంచ్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు రాజమౌళి. ‘‘అన్యా’స్ ట్యుటోరియల్’ కథను నిర్మాత అల్లు అరవింద్‌గారికి చెప్పాను. కొంత గ్యాప్ తర్వాత మళ్లీ చెప్పాను. ‘మొదటిసారి నువ్వు చెప్పిన సీన్ ఎందుకు తీసేశావు? అని అడిగారు’. ఎన్నో కథలు వినే ఆయన ఓ చిన్న సీన్‌ను ఎలా గుర్తుపెట్టుకున్నారా? అని ఆశ్చర్యం వేసింది. ఇదే ఆయన సక్సెస్‌కు ఓ సీక్రెట్ కావొచ్చు’’ అన్నారు పల్లవి గంగిరెడ్డి. ‘‘ఆహా’ టీమ్‌తో కలిసి ఇలాంటి కాన్సెప్ట్‌తో వస్తుండటం సంతోషంగా ఉంది’’ అన్నారు శోభు యార్లగడ్డ.
Comments
Please login to add a commentAdd a comment