Raja Mouli
-
ప్రియాంక చోప్రా..రెమ్యునరేషన్ ఇన్నికోట్ల..!
-
ఇంటర్మీడియట్ ప్రేమను రివీల్ చేసి షాక్ ఇచ్చిన రాజమౌళి
-
మగధీరకి కంగువకి లింక్ ఏంటి...
-
మహేష్ బాబు - రాజమౌళి టైటిల్ మీద కన్నేసిన బాలయ్య
-
రానా డైరెక్షన్ లో RGVతో రాజమౌళి షూటింగ్
-
దేవర దండయాత్ర రాజమౌళి కు చెక్ పెట్టిన ఎన్టీఆర్
-
రాజమౌళినే మెప్పించిన చిన్న సినిమా...
-
రాజమౌళి మూవీ కోసం లావు అవుతున్న మహేష్ బాబు
-
మహేష్, రాజమౌళి మూవీ యూనివర్సల్ టైటిల్ ఇదే?
-
గోల్డెన్ టైటిల్ తో వస్తున్న మహేష్, జక్కన్న..
-
SSMB 29 లో ఛాన్స్ కొట్టేసిన స్టార్ హీరోయిన్
-
SSMB 29.. మహేశ్ బాబు ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్!
-
మహేష్ బాబు న్యూ లుక్ పై రాజమౌళి అసహనం..
-
రాజమౌళి సినిమాలో విలన్ గా మహేష్ బాబు..?
-
"నాకు నచ్చలేదు" మహేష్ బాబు లుక్ పై రాజమౌళి
-
పాన్ ఇండియా ని షేక్ చేస్తున్న స్పిరిట్ రూమర్!
-
రాజమౌళి పై నెట్ ఫ్లిక్స్ డాక్యూమెంటరీ ఇందులో హైలైట్స్ చూస్తే..!!
-
ప్రిన్స్ బర్త్ డే రోజున రాజమౌళి అదిరిపోయే ట్రీట్?
-
సినిమా మూహూర్తం ఫిక్స్..! ప్రారంభమైన సెట్స్ పనులు
-
సెప్టెంబరులో స్టార్ట్
మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. కేఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని ఇటీవల ఓ సందర్భంలో ఈ చిత్ర కథారచయిత విజయేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ఫారెస్ట్ అడ్వెంచరస్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమా కోసం మహేశ్‌బాబు సరికొత్తగా మేకోవర్ అవుతున్నారు.మహేశ్ జుట్టు పెంచుతున్నారు. అలాగే బరువు కూడా పెరుగుతున్నారట. కాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రోడక్షన్ వర్క్స్‌ను పూర్తి చేసి, సెప్టెంబరులో చిత్రీకరణను మొదలుపెట్టేలా ప్లాన్ చేస్తున్నారట రాజమౌళి. అలాగే ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుందని, ఈ రెండు భాగాలను ఒకేసారి చిత్రీకరించేలా రాజమౌళి ప్లాన్ చేస్తున్నారని భోగట్టా. -
మహేష్ కి జోడీగా శ్రీదేవి కూతురు జాన్వీ జక్కన్న ప్లాన్ మామూలుగా లేదులే..
-
మహేష్, రాజమౌళి మూవీ అప్డేట్ అప్పుడేనా ?
-
ప్రపంచంలోనే అత్యధిక రెమ్యూనరేషన్ డైరెక్టర్స్ వీరే.
-
మహేష్ బాబు లుక్స్ ఎన్నో తెలిస్తే షాక్ అవుతారు
-
రాజమౌళి సినిమాలో మహేష్ బాబు లుక్స్ ఫ్యాన్స్ కి పూనకాలే..!
-
SSRMB: మహేష్ మూవీ కోసం రంగంలోకి జేమ్స్ కామెరూన్
-
మహేష్ బాబు కోసం హైదరాబాద్ రానున్న అవతార్ డైరెక్టర్
-
రాజమౌళి సెన్సేషన్.. SSMB 29 టైటిల్ ఫిక్స్..?
-
మహేష్ బాబు కోసం రంగంలోకి హాలీవుడ్ నటి
-
తెలుగులో పెద్ద హీరోలతో ఎందుకు చేయడం లేదు
-
రాజమౌళి, మహేష్ సినిమాలో నాగార్జున
-
మహేష్ మూవీ లో రాజమౌళి మార్క్
-
రాజమౌళి నటుడిగా మెప్పించిన సినిమాలు ఏంటో తెలుసా?
-
AI టెక్నాలజీ కోసం జర్మనీ వెళ్లిన మహేష్ బాబు
-
AI టెక్నాలజీ తో మహేష్ బాబు, రాజమౌళి సినిమా!
-
3 సం|| వెండితెరకు మహేష్ బాబు దూరం
-
రాజమౌళి మహేష్ బాబు మూవీలో కొత్త ట్విస్ట్
-
హేష్ మూవీ పై జక్కన్న భారీ ప్లాన్..!
-
మహేష్ ఫ్యాన్స్‌కు పండగే... 5000 కోట్లు టార్గెట్ చేసిన జక్కన్న
-
రామ్ చరణ్, ఎన్టీఆర్ తో రాజమౌళి మరో సినిమా
-
రామ్ చరణ్, ఎన్టీఆర్ తో రాజమౌళి డాక్యుమెంటరీ సినిమా
-
అడవి బాట... బాక్సాఫీస్ వేట
బాక్సాఫీస్ వసూళ్ల వేట కోసం తెలుగు హీరోలు కొందరు అడవి బాట పట్టారు. అడవి నేపథ్యంతో కూడిన కథలతో ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధం అవుతున్నారు. ఆ అడవి కథలపై కథనం. అడవిలో ఈగల్ ‘ఎక్కడుంటాడు? అని రవితేజను ఉద్దేశిస్తూ అవసరాల శ్రీనివాస్‌ను అనుపమా పరమేశ్వరన్ అడగ్గానే అడవిలో ఉంటాడు అని సమాధానం చెబుతారు. ఈ సంభాషణ ఇటీవల విడుదలైన ‘ఈగల్’ సినిమా టీజర్లోనిది. రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. కథ రీత్యా ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు అడవి నేపథ్యంలో ఉంటాయని టీజర్ స్పష్టం చేస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 13న విడుదల కానుంది. ఆఫ్రికన్ అడ్వెంచర్ ఆఫ్రికన్ అడవుల్లో వేటకు సిద్ధమౌతున్నారు మహేశ్‌బాబు. రాజమౌళి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. రచయిత–దర్శకుడు కె. విజయేంద్రప్రసాద్ ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు. ఈ చిత్రంలోని ప్రధాన కథాంశం ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగుతుందని, సహజమైన లొకేషన్స్‌లోనే చిత్రీకరించేలా రాజమౌళి అండ్ టీమ్ ప్లాన్ చేస్తున్నారనే టాక్ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, విజయేంద్రప్రసాద్ ఈ సినిమాకు స్క్రిప్ట్‌కు మరింత పదును పెడుతున్నారని తెలిసింది. వచ్చే ఏడాది వేసవి తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆరంభించడానికి ప్లాన్ చేస్తున్నారట. కేఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మించనున్నారు. అడవుల్లో దేవర ‘జనతా గ్యారేజ్’ చిత్రం తర్వాత హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘దేవర’. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. దేశంలో విస్మరణకు గురైన తీర ప్రాంతాల నేపథ్యంలో ఈ సినిమా ప్రధాన కథనం సాగుతుంది. అయితే కథ రీత్యా ‘దేవర’లో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ సీన్స్ ఉన్నాయని, ఈ సన్నివేశాల చిత్రీకరణ అడవుల్లో జరుగుతుందని, ఇవి ‘దేవర పార్ట్ 2’లో ఉంటాయనే టాక్ వినిపిస్తోంది. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో హిందీ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నారు. కల్యాణ్ రామ్, కె. హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్న ‘దేవర’ సినిమా తొలి భాగం వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల కానుంది. పుష్పరాజ్ రూల్ ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో దర్శకుడు సుకుమార్ అల్లుకున్న ఊహాత్మక కథ ‘పుష్ప’. ఇందులో పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ టైటిల్ రోల్ చేస్తున్నారు. ‘పుష్ప’ సినిమాలోని తొలి భాగం ‘పుష్ప: ది రైజ్’ ఇప్పటికే విడుదలై, సూపర్‌హిట్‌గా నిలిచింది. దీంతో మలి భాగం ‘పుష్ప: ది రూల్’ కోసం ప్రస్తుతం వర్క్ చేస్తున్నారు హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. కాగా ‘పుష్ప: ది రైజ్’ సినిమాలోని కీలక సన్నివేశాలు, కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌ల మాదిరిగానే ‘పుష్ప: ది రూల్’లోనూ ప్రధాన సన్నివేశాలు అడవుల నేపథ్యంలోనే సాగుతాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 15న రిలీజ్ కానుంది. న్యూజిల్యాండ్‌లో కన్నప్ప శివ భక్తుడు కన్నప్ప జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘కన్నప్ప’. మంచు విష్ణు టైటిల్ రోల్ చేస్తుండగా మోహన్‌బాబు, ప్రభాస్, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, శరత్‌కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా మేజర్ షూటింగ్ న్యూజిల్యాండ్‌లో జరుగుతుంది.ప్రస్తుతం అక్కడి లొకేషన్స్‌లోనే ఈ సినిమా చిత్రీకరణ సాగుతోంది. కథ రీత్యా ‘కన్నప్ప’ సినిమాలోని చాలా సన్నివేశాలు అడవి నేపథ్యంలోనే ఉంటాయి. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకాలపై మోహన్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇలా అడవి నేపథ్యంలో సాగే చిత్రాలు మరికొన్ని ఉన్నాయి. -
కోహ్లి పై రాజమౌళి ట్వీట్ వైరల్.
-
సినిమాపై ఫాన్స్ కు పూనకాలు ఇచ్చే అప్డేట్
-
హీరోలను స్టార్స్ చేసి చరిత్ర సృష్టించిన రాజమౌళి
-
RRR సీక్వెల్ పై క్లారిటీ..!
-
రాజమౌళి వచ్చాక మా జీవితాలు మారిపోయాయి
-
ఆ మనిషి చాలా డిఫరెంట్..అతనితో కొంచెం కష్టం
-
రాజమౌళిని ఫాలో అవుతున్న డైరెక్టర్స్
-
బాహుబలి 3 కన్ఫర్మ్? పక్కా ప్లానింగ్ తో రాజమౌళి...!
-
రాజమౌళి కుటుంబంతో ఉండే మజానే వేరు.. ఇక నా అమెరికా అల్లుడి గురించి చెప్పాలంటే..
-
ఇండియా చెరిత్రలోనే భారీ బడ్జెట్ సినిమా ఊహించని రిస్క్ చేయబోతున్న రాజమౌళి
-
చిరంజీవి దారిలో దూసుకుపోతున్న బాలకృష్ణ,నాగార్జున,వెంకటేష్
-
సాహూ RRR 102 సెంటర్స్ లో 200 రోజులు
-
మహిశ్మతిపై పుష్ప రాజ్ యుద్ధం
-
శిల్పాకళావేదికలో ‘నాటు నాటు’ ఆర్ఆర్ఆర్ టీంకు అభినందన సభ (ఫోటోలు)
-
దసరా వెనుక దర్శక ధీరుడు.. అందుకే 100 కోట్ల వసూళ్లు?
-
టాలీవుడ్ మెగా హీరో రామ్‌చరణ్‌పై ప్రశంసలు..
-
ఆర్ఆర్ఆర్ మేనియా: రామ్ చరణ్‌పై ఆనంద్ మహీంద్ర ట్వీట్ వైరల్!
సాక్షి,ముంబై: పారిశ్రామికవేత్త, ఎంఅండ్ఎం ఆనంద్‌మహీంద్ర ఆర్ఆర్ఆర్ ప్రభంజనంపై స్పందించారు.సోషల్ మీడియాలో ఎపుడూ తరచుగా ఉండే ఆయన తాజాగా టాలీవుడ్ మెగా హీరో రామ్ చరణ్‌పై ప్రశంసలు కురిపించారు. మెగా పవర్ స్టార్‌ను గ్లోబల్ స్టార్ అంటూ కితాబిచ్చారు. ఈ సందర్భంగా ఒక వీడియోను కూడా ఆయన షేర్ చేశారు. గుడ్ మార్నింగ్ అమెరికా అనే పాపులర్ టీవీ షోలో పాల్గొన్న తొలి భారతీయ నటుడిగా రామ్ చరణ్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దాంతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్‌గా అందరూ పొగిడేస్తున్నారు. దీంతో ఆనంద్ మహీంద్రా కూడా ట్వీట్ చేశారు. గుడ్ మార్నింగ్ అమెరికా సోషల్ మీడియా పోస్టును రీట్వీట్ చేసిన ఆయన రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అంటూ కొనియాడటం విశేషం. ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీ అంతర్జాతీయ పలు అవార్డులతో ప్రపంచ ఖ్యాతిని దక్కించుకుంటోంది.దీంతో ఆ మూవీ హీరో జూఎన్టీఆర్, రామ్ చరణ్ గ్లోబల్ స్టార్స్‌గా మారిపోయారు. ముఖ్యంగా జేమ్స్ కామెరాన్ వంటి దర్శక దిగ్గజం రామ్ చరణ్ నటనను ప్రత్యేకంగా ప్రస్తావించడం గమనార్హం. మరోవైపు ఆర్ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియా స్టార్ హీరో రామ్ చరణ్ మరో అరుదైన ఘనతను తన సొంతం చేసుకున్నారు. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు ఫంక్షన్ ప్రెజెంటర్‌గా రామ్ చరణ్ బెస్ట్ వాయిస్ ఓవర్ అవార్డును ప్రకటించారు. అలాగే ఈ మూవీ సినిమా ఏకంగా నాలుగు అవార్డులను అందుకుంది. బెస్ట్ మూవీ, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్, బెస్ట్ స్టంట్స్, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డులు అందుకుంది. గతంలో హెచ్‌సీఏ స్పాట్ లైట్ అవార్డును కూడా ప్రకటించడంతో, మొత్తం ఐదు అవార్డులను ఈ మూవీ దక్కించుకుంది. కాగా మార్చ్ 12న జరిగే ఆస్కార్ అవార్డ్స్ ఫంక్షన్ కోసం ఇప్పటికీ చిత్రబృందం అమెరికా చేరుకుంది. అంతేకాదు మార్చ్ 16న ప్రకటించ నున్న క్రిటిక్స్ సూపర్ అవార్డ్స్ ఉత్తమ నటుడు అవార్డుకు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నామినేట్ అయ్యారు. దీనిపై రామ్‌చరణ్ ట్వీట్ చేశారు కూడా. This man is a Global Star. Period. #NaatuNaatu @AlwaysRamCharan https://t.co/JcanE3OJmq — anand mahindra (@anandmahindra) February 25, 2023 Delighted to see my brother @tarak9999 ‘s and my name on the nominees list of Best Actor in an Action Movie. What a beautiful feeling to see our names next to legends like Nicolas Cage, Tom Cruise and Brad Pitt! https://t.co/FVVPx1lm9i — Ram Charan (@AlwaysRamCharan) February 25, 2023 -
ఆర్ఆర్ఆర్.. ఓ కనువిందు – స్టీవెన్ స్పీల్బర్గ్
‘ఆర్ఆర్ఆర్’ సినిమాని ప్రశంసించారు హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్. ఆయన దర్శకత్వంలో వచ్చిన హాలీవుడ్ చిత్రం ‘ది ఫేబుల్‌మ్యాన్స్’ గత ఏడాది నవంబరులో రిలీజ్ అయింది. ఈ చిత్రాన్ని ఈ నెల 10న రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఇండియాలో రిలీజ్ చేసింది. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా స్టీవెన్ స్పీల్బర్గ్ను దర్శకుడు రాజమౌళితో ఆన్లైన్ వేదికగా ఇంటర్వ్యూ చేయించారు సంస్థ ప్రతినిధులు. ఈ ఇంటర్వ్యూలోని కొన్ని విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా, ఈ ఇంటర్వ్యూ వేదికగా ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ను మెచ్చుకున్నారు స్పీల్బర్గ్. ‘‘దర్శకుడు రాజమౌళిని తొలిసారి కలుసుకున్నప్పటికి నేను ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చూడలేదు. ఇటీవల ఈ సినిమా చూశాను. ఐ క్యాండీ (కనువిందు)గా అనిపించింది. అద్భుతంగా ఉంది’’ అన్నారు స్పీల్బర్గ్. ఆ ప్రశంసలకు రాజమౌళి స్పందిస్తూ.. మీరు (స్టీవెన్ స్పీల్బర్గ్) సినిమా చూసినందుకు చాలా ఆనందంగా ఉందనీ, సంతోషంతో డ్యాన్స్ చేయాలనిపిస్తోందనీ అన్నారు. ‘ది ఫేబుల్‌మ్యాన్స్’ను తాను చూశానని, నచ్చిందని కూడా రాజమౌళి పేర్కొన్నారు. -
‘నాటునాటు’: అంత ఎనర్జీలేదు అయినా ఓకే.. ఆనంద్ మహీంద్ర ట్వీట్ వైరల్
సాక్షి,ముంబై: ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర మరో ఇంట్రస్టింగ్ వీడియోను షేర్ చేశారు. టాలీవుడ్ అగ్ర దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ సృష్టించిన సంచలనం అంతా ఇంతాకాదు. ఇక తాజాగా ఈ మూవీలోని పాట ‘నాటునాటు’ ప్రపంచ చలన చిత్ర రంగానికి చెందిన ప్రతిష్ఠాత్మక ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డు సొంతం చేసుకుని ప్రపంచవ్యాప్తంగా పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీనిపైనే ఆనంద్ మహీంద్ర తాజాగా ట్విటర్ ద్వారా స్పందించారు. ‘నాటు నాటు పాట తెలియని వారుండరు. ఈ వీడియోలోని ఈ రెండు పాత్రల్లో బ్రిటిష్-అమెరికన్ కామెడీ జంట లారెల్- హార్డీ డ్యాన్స్‌లో ఆర్ఆర్ఆర్ హీరోల్లో కనిపించినంత ఎనర్జీ కనిపించకపోవచ్చు..కానీ పర్లేదు. ఎంజాయ్ చేయండి’ అంటూ ఆనంద్ మహీంద్ర పేర్కొనడంతో నాటునాటు మేనియా ఒక రేంజ్లో సాగుతోంది. పర్ఫెక్ట్ ఫ్రైడే అంటూ తెగ సంబరపడి పోతున్నారు. కామెడీ కింగ్స్ బ్రిటిష్-అమెరికన్ కామెడీ జంట లారెల్-హార్డీ స్టెప్పులేస్తున్న ఒక వీడియోను ఆనంద్ మహీంద్ర షేర్ చేశారు. ‘నాటునాటు’ పాటకు వారు డ్యాన్స్ వేస్తే ఎలా ఉంటుందో.. అచ్చంగా ఆ పాటకు తగినట్టుగా ఉన్న ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. సూపర్‌గా సెట్ అయిందంటూ ఫ్యాన్స్ కామెంట్ చేశారు. ముఖ్యంగా భారత్ బయోటెక్ జేఎండీ సుచిత్ర ఎల్లా కూడా దీనిపై స్పందించారు. సంగీతం, నృత్యం, సినిమాలకు సంస్కృతి, భాష, జాతీయ, అంతర్జాతీయ అపుడు ఇపుడూ సరిహద్దులు లేవు. మూకీ సినిమాల కాలం నుండి ఇది ప్రపంచవ్యాప్తంగా నిరూపించబడింది!! అంటూ ఆమె ట్వీట్ చేశారు. కాగా నాటునాటు పాటకు ఇన్సిపిరేషన్‌గా ఉన్న ఈ వీడియో గత ఏడాది సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. No wonder music , dance & cinema have no boundaries of culture , language , national, international , now or from the past too !! proven world over since the time of silent movies !! — Suchitra Ella (@SuchitraElla) January 13, 2023 No one is immune from the catchiness of #NaatuNaatu. Not even inhabitants of the past..😄 L&H may not have the same energy as the #RRR duo but they’re not bad! Enjoy the #FridayFeeling pic.twitter.com/9tMSfAKux5 — anand mahindra (@anandmahindra) January 13, 2023 -
రాజమౌళి తండ్రి హైస్కూల్ వరకూ చదివింది ఇక్కడే..
కొవ్వూరు(తూర్పుగోదావరి): రాష్ట్రపతి కోటాలో ప్రముఖ సినీ కథా రచయిత కోడూరి విజయేంద్ర ప్రసాద్ రాజ్యసభకు ఎంపిక కావడంపై ఆయన స్వస్థలం కొవ్వూరులో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రాజ్యసభకు బుధవారం ఎంపిక చేసిన నలుగురు దక్షిణాది ప్రముఖుల్లో విజయేంద్ర ప్రసాద్ ఒకరు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ కోడూరి శివరామకృష్ణకు విజయేంద్ర ప్రసాద్ స్వయానా పెదనాన్న కొడుకు. చదవండి: దక్షిణాదికి అగ్రపీఠం.. తన కంటే పదిహేను రోజులు చిన్నవాడంటూ శివరామకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు. ఈయన పెదనాన్న కోడూరి అప్పారావుకు ఆరుగురు కుమారులు. వీరిలో ఆరో సంతానం విజయేంద్ర ప్రసాద్. ఈయన హైస్కూలు విద్యాభాస్యం వరకూ కొవ్వూరులోనే సాగింది. అనంతరం ఏలూరులో చదివారు. 1975–76 సంవత్సరాల్లో ఆయన కుటుంబం కర్ణాటకలోని తుంగభద్ర ప్రాంతానికి వెళ్లిపోయింది. కొన్నాళ్లు కర్ణాటక, కొవ్వూరులో కొన్ని వ్యాపారాలు చేశారు. వాటిలో రాణించలేకపోయారు. అప్పటికే సినీరంగంలో స్ధిరపడిన సోదరుడు శివదత్త ప్రోత్సాహంతో ఆ వైపు వెళ్లినట్లు విజయేంద్ర సన్నిహితులు చెబుతున్నారు. మద్రాసు సినీరంగంలో అడుగుపెట్టి వెండితెరకెక్కిన పెద్ద చిత్రాలకు రచయితగా కొనసాగారు. బాహుబలి..ఆర్ఆర్ఆర్ ఆయన కలం నుంచి రూపం దిద్దుకున్నవే. విజయేంద్ర కుమారుడు, ప్రముఖ సినీదర్శకుడు రాజమౌళి విద్యాభాసం కుడా కొవ్వూరులోని దీప్తీ పాఠశాలలోనే సాగింది. విజయేంద్ర ప్రసాద్ సినీరంగంపై వేసిన ప్రభావవంతమైన ముద్రకు గుర్తింపుగా రాజ్యసభ సీటు ఇవ్వడం ఆనందంగా ఉందని ఆయన కుటుంబీకులు న్యాయవాది కోడూరి నరసింహారావు అన్నారు. తన తాతయ్య విజయేంద్ర ప్రసాద్ తండ్రి, శివరామకృష్ణ తండ్రి అన్నదమ్ములని నరసింహారావు చెప్పారు. -
అలా భయపెట్టడం ఇష్టం: రాజమౌళి
‘‘హారర్ జానర్లో రెండు టైప్స్. ఒకటి ఐడియాతో భయపెట్టడం. మరోటి సడన్‌గా ఎవరో వెనకనుంచి రావడం లేదా సౌండ్‌తో భయపెట్టడం. నాకు ఐడియాతో భయపెట్టడం ఇష్టం. ‘అన్యా’స్ ట్యుటోరియల్ చూసినవారు ఎందుకు మాయం అవుతున్నారనే ఐడియా ఇంట్రెస్టింగ్గా ఉంది. పల్లవి, సౌమ్యల ఫ్రెష్ వర్క్, కొత్త ఐడియాలజీ, ఉత్సాహం బాగున్నాయి’’ అన్నారు దర్శకుడు రాజమౌళి. రెజీనా, నివేదితా సతీష్ ముఖ్య తారలుగా పల్లవి గంగిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన వెబ్ సిరీస్ ‘అన్యా’స్ ట్యుటోరియల్’. ఆర్కా మీడియా, ఆహా నిర్మించిన ఈ సిరీస్ జూలై 1 నుంచి తెలుగు, తమిళ భాషల్లో ‘ఆహా’ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా జరిగిన ఈ వెబ్‌సిరీస్ ట్రైలర్ లాంచ్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు రాజమౌళి. ‘‘అన్యా’స్ ట్యుటోరియల్’ కథను నిర్మాత అల్లు అరవింద్‌గారికి చెప్పాను. కొంత గ్యాప్ తర్వాత మళ్లీ చెప్పాను. ‘మొదటిసారి నువ్వు చెప్పిన సీన్ ఎందుకు తీసేశావు? అని అడిగారు’. ఎన్నో కథలు వినే ఆయన ఓ చిన్న సీన్‌ను ఎలా గుర్తుపెట్టుకున్నారా? అని ఆశ్చర్యం వేసింది. ఇదే ఆయన సక్సెస్‌కు ఓ సీక్రెట్ కావొచ్చు’’ అన్నారు పల్లవి గంగిరెడ్డి. ‘‘ఆహా’ టీమ్‌తో కలిసి ఇలాంటి కాన్సెప్ట్‌తో వస్తుండటం సంతోషంగా ఉంది’’ అన్నారు శోభు యార్లగడ్డ. -
ఆర్ఆర్ఆర్ రిలీజ్.. వసూళ్ల జాతరకు టీ సర్కార్ గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. రాజమౌళి డెరెక్షన్‌లో తెరకెక్కిన ఈ మల్టీస్టారర్ మూవీలో.. జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ నటించిన సంగతి తెలిసిందే. కరోనా ఎఫెక్ట్‌తో వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న ఈ సినిమా.. ఎట్టకేలకు ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ సినిమా టిక్కెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పిస్తూ.. తెలంగాణ ప్రభుత్వం శనివారం ఓ జీవో విడుదల చేసింది. తాజా జీవో ప్రకారం.. సాధారణ థియేటర్లలో మొదటి మూడు రోజులకు రూ. 50 పెంపు, తర్వాత వారం రోజులకు రూ. 30 పెంచుకునే అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఇక, మల్టీప్లెక్స్, ఐమాక్స్‌లో మొదటి మూడు రోజులకు రూ. 100 పెంపు, తర్వాత వారం రోజులు రూ. 50 పెంచుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. మార్చి 25 నుంచి 10 రోజుల పాటు రోజుకు 5 షోలకు తెలంగాణ సర్కార్ అనుమతిని ఇస్తున్నట్లు ప్రకటించింది. అంతకుముందు ఆర్ఆర్ఆర్ మూవీ టికెట్ రేట్ల పెంపునకు ఏపీ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. హై బడ్జెట్ సినిమా కావడంతో టికెట్ల రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వం అంగీకరించింది. ఈ సినిమా టికెట్‌పై మరో రూ. 75 పెంచుకునేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొదటి 10 రోజులు ఈ పెంపునకు అనుమతి ఇచ్చింది. కాగా, రూ. 336 కోట్లతో సినిమా నిర్మించినట్లు ఆర్ఆర్ఆర్ సినిమా నిర్మాతలు దరఖాస్తు చేసుకున్నారు. దీన్ని పరిశీలించిన తర్వాత టికెట్ రేట్ల పెంచుకోవడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. -
ఇప్పుడు చాలా సంతోషం
సాక్షి, అమరావతి : సినిమా టికెట్ ధరలు, ఇతర సమస్యలపై సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో గురువారం ఆయన క్యాంపు కార్యాలయంలో సమావేశమైన సందర్భంగా చాలా సంతోషం వ్యక్తం చేశారు. సీఎం ప్రతిపాదనలు ఉభయ తారకంగా.. ఇటు ప్రేక్షకులు, అటు సినీ రంగానికి ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. సమావేశంలో సీఎంతో, అనంతరం మీడియాతో వారు మాట్లాడిన మాటలు ఇలా ఉన్నాయి. సంతృప్తిగా ఉంది : చిరంజీవి పరిశ్రమలో అందరితో మాట్లాడి మీ ముందుకు వచ్చాం. మీ ప్రతిపాదనలు చూశాక మాకు చాలా సంతృప్తిగా ఉంది. కమిటీ ఇచ్చిన నివేదికతో పాటు మంచి, చెడ్డలు తెలుసుకోవడానికి, మా అభిప్రాయం సేకరించడానికి తొలుత ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి నన్ను ఆహ్వానించారు. ఆ తర్వాత కలిసికట్టుగా అందరం వచ్చి అభిప్రాయాలను వ్యక్తీకరించడానికి ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. మీ అభిప్రాయాలను, మీ నిర్ణయాలను ఎప్పుడూ గౌరవిస్తాం. మీరు పేదల మనిషి. ఉభయులకీ సామరస్యంగా ఉండేలా నిర్ణయం తీసుకోవడం బాగుంది. మా అందరికీ చాలా వెసులుబాటు కల్పించారు. మీరు తీసుకున్న నిర్ణయాలు పట్ల ఎగ్జిబిటర్ల రంగం చాలా సంతోషంగా ఉంది. అందరం ఇదే అభిప్రాయంతో ఉన్నాం. టికెట్ రేట్లుగాని, ఇతరత్రా విషయాల్లో చాలా ఎక్సర్సైజ్ చేశారు. పెట్టే అమ్మను అన్నీ అడుగుతారు. ఇచ్చే వారినే కోరుతారు. అందుకే మేం కొన్ని కోరికలు కోరుతున్నాం. సినిమా థియేటర్‌కు ప్రేక్షకులను రప్పించడానికి కొన్ని ప్రత్యేకతలు సినిమాలోకి తీసుకురావాల్సి వస్తోంది. విజువల్ ఇంపాక్ట్ కోసం ఖర్చు చేయాల్సి వస్తోంది. అవి ఉంటేనే కానీ జనాలు థియేటర్‌కు వెళ్లి సినిమా చూడాలనే మూడ్‌లో లేరు. మా సినిమాలు విడుదలైన వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు ఓటీటీ రూపంలో వస్తోంది. అలాగే పైరసీ ఎప్పటి నుంచో మాకున్న పెద్ద గొడ్డలిపెట్టు. ఇవన్నీ అధిగమించి మేం సినిమాలు తీయాలంటే.. మేం ఖర్చు అధికంగా పెట్టాల్సి వస్తోంది. తెలుగుతనాన్ని, తెలుగు సినిమాను కాపాడే దిశగా మీరు ఉన్నారు. అది కొనసాగే దిశగా మీ చర్యలు కొనసాగాలి. అందులో భాగంగా ఇండస్ట్రీ వైపు చల్లని చూపు చూడాలి. తల్లి స్థానంలో ఉన్నారు కాబట్టి మిమ్నల్ని అడుగుతున్నాం. తర్వాత ఐదో షో మన నారాయణ మూర్తి గారు ఎప్పటి నుంచో అడుగుతున్నారు. అది ఉంటే మనకు కొంత వెసులుబాటు ఉంటుంది. అది మీ ముందు పెడితే మీరు ఒప్పుకున్నారు. సీఎంకు ధన్యవాదాలు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, మా ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన సీఎం వైఎస్ జగన్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు. సినీ పరిశ్రమ కళకళలాడాలంటే చిన్న నిర్మాతలు, పెద్ద నిర్మాతలు అందరూ బాగుండాలి. అప్పుడే పరిశ్రమపై ఆధారపడిన వేలాది మంది నటులు, కార్మికులకు చేతినిండా పనిదొరుకుతుంది. ఈ ఉద్దేశంతో ఐదో షోకు మేము అనుమతి కోరితే.. సీఎం వైఎస్ జగన్ ఆమోదం తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమకు దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా గొప్ప కీర్తి లభిస్తోంది. అందుకు కారణమైన భారీ బడ్జెట్ సినిమాలకు వెసులుబాటు కల్పించే అంశంపై కమిటీతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తెలంగాణ తరహాలోనే ఆంధ్రప్రదేశ్‌లోనూ సినీ పరిశ్రమ అభివృద్ధి చెందాలని సీఎం వైఎస్ జగన్ ఆకాంక్షించారు. అందాల నగరమైన విశాఖపట్నంను సినీ పరిశ్రమకు హబ్‌గా మార్చుతామని.. మౌలిక సదుపాయాల కల్పనకు సహకరిస్తామని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందడానికి బాటలు వేస్తుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సినీ పరిశ్రమ సమంగా అభివృద్ధి చెందడానికి మా వంతు సహకారం అందిస్తామని సీఎం వైఎస్ జగన్‌కు చెప్పాం. సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారంలో ముందు నుంచి ఎంతో చొరవ తీసుకున్న సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానికి కృతజ్ఞతలు. సీఎం తీసుకున్న నిర్ణయాలపై ఈనెల మూడో వారంలోగా ప్రభుత్వం ఉత్తర్వులు (జీవో) జారీ చేస్తుందని భావిస్తున్నాం. ఇకపై ఎలాంటి సమస్యలు వచ్చినా చర్చలతో సామరస్య పూర్వకంగా పరిష్కరించుకుంటాం. సినీ పరిశ్రమకు సంపూర్ణ సహకారం సినిమాటోగ్రఫీ, సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంపూర్ణ సహకారం అందజేస్తారు. సినీ పరిశ్రమకు అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. పరిశ్రమ సమస్యలను సీఎం జగన్ దృష్టికి తీసుకొచ్చి, పరిష్కారానికి కృషి చేసిన మెగాస్టార్ చిరంజీవికి ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం సీఎం ప్రత్యేకంగా కమిటీ వేశారు. సినీ ప్రముఖులు ప్రతి సమస్యపైనా సీఎంతో విపులంగా చర్చించారు. పరిశ్రమకు సంబంధించిన వారు, సంబంధం లేని వారు సూటిపోటి మాటలతో ఇబ్బంది పెడుతున్నా.. చిరంజీవి వాటిని భరిస్తూ సినీ పరిశ్రమ శ్రేయస్సు కోసం సీఎం జగన్‌తో చర్చలు జరిపారు. పరిశ్రమకు ఉపశమనం కల్పించారు. చిన్న సినిమాలకు సంబంధించి నటుడు ఆర్.నారాయణమూర్తి ఆవేదనను సీఎం వైఎస్ జగన్ అర్థం చేసుకున్నారు. పండగ, సెలవు రోజుల్లో చిన్న సినిమాలకు అవకాశం కల్పించాలని, అవి బతికేలా చర్యలు తీసుకోవాలని సినీ పరిశ్రమ పెద్దలను సీఎం కోరారు. దీనిపై వారు సానుకూలంగా స్పందించారు. సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారం, అభివృద్ధికి ఏ సహకారం కావాలన్నా అందజేస్తామని వైఎస్ జగన్ చెప్పారు. విశాఖపట్నంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున సినిమాలు చిత్రీకరించేలా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ చేసిన ప్రతిపాదనకు సినీ ప్రముఖులు సానుకూలంగా స్పందించారు. తమకు హైదరాబాద్ ఎంతో ఆంధ్రప్రదేశ్ కూడా అంతేనని, ఇక్కడా భారీ ఎత్తున సినిమాలు చిత్రీకరిస్తామని వారు సీఎంకు హామీ ఇచ్చారు. సమస్యల పరిష్కారానికి దారి చూపిన సీఎం కోవిడ్ కారణంగా సినిమా పరిశ్రమకు పెద్ద ఇబ్బంది వచ్చింది. గత రెండేళ్ల నుంచి తీవ్ర సంక్షోభంలో ఉంది. మా కెరీర్లో ఈ రెండేళ్లు చాలా ఇబ్బందికరం. ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు మధ్య ఉన్న గ్యాప్.. ఈ తరహా చర్చల వల్ల తొలగిపోతాయి. ఈ రెండేళ్లలో ఎప్పుడు షూటింగ్ ఆగిపోతుందో.. ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియని పరిస్థితి ఉండింది. ఇవాళ చాలా సంతోషకరమైన రోజు. సినీ పరిశ్రమ సందిగ్ధంలో పడిపోయిన తరుణంలో చిరంజీవి ముందడుగు వేసి.. సీఎం జగన్‌తో చర్చించి, సమస్యల పరిష్కారానికి దారి చూపించారు. ఈ రోజు సినీ పరిశ్రమకు సీఎం జగన్ గొప్ప ఉపశమనం కల్పించినందుకు కృతజ్ఞతలు. వారం పది రోజుల్లోనే శుభ వార్త వింటాం. సమస్య పరిష్కారానికి చొరవ చూపిన చిరంజీవికి, మంత్రి పేర్ని నానికి ధన్యవాదాలు. – మహేష్‌బాబు, సినీనటుడు ఇండస్ట్రీకి మంచి చేస్తే అందరికీ లాభం గతంలో సినిమాలు 50 రోజులు, 100 రోజులు ఆడేవి. ఇప్పుడు శుక్రవారం, శనివారం, ఆదివారం ఈ మూడు రోజుల్లో ఏ స్టార్ సినిమా అయినా హిట్ లేదా ప్లాప్. ఇండస్ట్రీలో దర్శకులు, నిర్మాతలు, నటులు మాత్రమే కాదు వేల మంది టెక్నీషియన్లు ఉన్నారు. ఇండస్ట్రీకి మంచి చేస్తే ఆ టెక్నీషియన్స్ గుండెల్లో మీరు ఉండిపోతారు. అందరికీ మేలు జరుగుతుంది. – అలీ, సినీనటుడు సంతోషంగా ఉంది ఇప్పటి వరకు సినీ పరిశ్రమకు, ప్రభుత్వానికి మధ్య ఒక అగాధం ఉందనే భ్రమ ఉండేది. ఈ రోజుతో అది తొలగిపోయింది. మాతో మీరు (సీఎం) నేరుగా మాట్లాడుతున్నందుకు సంతోషంగా ఉంది. సినీ పరిశ్రమకు సంబంధించి సినిమా థియేటర్ యజమాని నుంచి ఎగ్జిబిటర్, నిర్మాత వరకు ఉన్న సమస్యలపై సీఎం జగన్‌కు సంపూర్ణ అవగాహన ఉంది. సమస్యల పరిష్కారానికి మా ప్రతిపాదనలన్నీ విని.. సానుకూలంగా స్పందించినందుకు కృతజ్ఞతలు. సమస్య పరిష్కారానికి చొరవ చూపిన చిరంజీవికి, మంత్రి పేర్ని నానికి ధన్యవాదాలు. సినిమా పెద్ద అంటే చిరంజీవికి నచ్చదు. కానీ ఆయన చేసే పనుల వల్ల ఆయనకు పెద్దరికం వచ్చింది. సీఎం వైఎస్ జగన్‌తో తనకు ఉన్న సాన్నిహిత్యంతో చిరంజీవి చర్చలు జరిపి.. సినీ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. – రాజమౌళి, దర్శకుడు మీరు చేయాలనుకుంటే చేస్తారు చిన్న సినిమాలు బతకాలి. ఇంతకు ముందు నేను చిన్న సినిమాలకు రాసేవాడిని. ప్రేయసిరావే, గాయం, స్నేహితులు.. ఇలాంటి వాటికి రాశాను. శివయ్య నేనే రాశాను. పెద్ద హిట్ అయింది. చిన్న సినిమాలకు థియేటర్లు ఇవ్వడం లేదు. వీటి వల్ల చిన్న సినిమా చచ్చిపోయింది. సీఎం చేయాలనుకుంటే.. ఏదైనా మనస్ఫూర్తిగా చేస్తారు. చిన్న సినిమాలకు మీరు తోడుగా నిలవండి. కేరళలో కూడా చిన్న సినిమాలు బాగా నడుస్తున్నాయి. సినిమా పరిశ్రమలో 30 వేల మంది టెక్నీషియన్లు ఉన్నారు. – పోసాని కృష్ణమురళి, సినీ నటుడు సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు సీఎం వైఎస్ జగన్ మాకు సమయం ఇచ్చారు. సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారంపై సానుకూలంగా స్పందించారు. చాలా సమస్యలకు పరిష్కారం లభించింది. అందుకు కృతజ్ఞతలు. ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న చిరంజీవికి, మంత్రి పేర్ని నానికి ధన్యవాదాలు. – ప్రభాస్, సినీనటుడు చిన్న సినిమా బతకాలి సగటు సినిమా బతకాలి. పండుగ వచ్చినా, సెలవులు వచ్చినా.. పెద్ద సినిమాలకే అవకాశాలు వస్తున్నాయి. చిన్న సినిమా కూడా బతకాలి. హిట్ అయితేనే సినిమాలు చూస్తారు. చిన్న సినిమాలకు నూన్ షో ఉండాలని కోరుతున్నాం. భారీ సినిమా ఎలాంటి ఫలితాలు అనుభవిస్తుందో.. సగటు సినిమా అలాంటి ఫలితాలు అనుభవించాలి. పండగలు, సెలవుల సమయాల్లో పెద్ద సినిమాలదే హవా. ఆ సమయంలో చిన్న, సగటు సినిమాలు ప్రదర్శించడానికి థియేటర్లు దొరకడం లేదు. థియేటర్లను అడుక్కోవాల్సిన పరిస్థితి. సగటు సినిమా మనుగడ ప్రశ్నార్థకమైన సమయంలో.. సినిమాను నిలబెట్టేలా మహానుభావుడు సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో సినీ పరిశ్రమ విరాజిల్లుతుంది. సినీ పరిశ్రమలో ఉత్తమ పనితీరు కనబరిచిన కళాకారులకు ఏటా నంది అవార్డులు ఇచ్చి ప్రోత్సహించాలి. పరిశ్రమ సమస్యలు పరిష్కరించినందుకు సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు. సీఎంతో తనకున్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకుని.. సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారానికి కృషి చేసిన చిరంజీవికి కృతజ్ఞతలు. పరిశ్రమ సమస్యల పరిష్కారంలో చొరవ చూపిన మంత్రి పేర్ని నానికి ధన్యవాదాలు. – ఆర్.నారాయణ మూర్తి, సినీనటుడు, దర్శకుడు, నిర్మాత -
నీ భాష నాకు అర్ధం కాదు.. ఎన్టీఆర్‌పై ఆలియా భట్ పంచ్!
రాజమౌళి చిత్రం ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా బాలీవుడ్ బ్యూటి ఆలియా భట్ తెలుగు తెరకు పరిచయమవుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్లో బాగంగా జరిగిన ఓ ప్రెస్మీట్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌పై ఆలియా సెటైర్ వేసింది. జూ.ఎన్టీఆర్ ఎక్కడికి వచ్చినా ఎక్కువగా తెలుగులోనే మాట్లాడుతున్నాడని..అది తనకు అర్దం కావడం లేదని చెప్పింది. అయితే దానిని ఎవరైనా అనువదించి తనకు చెప్తారేమోనని దిక్కులు చూడాల్సి వస్తోందంటూ చెప్పుకొచ్చింది. ఓ ప్రెస్మీట్లో ఎన్టీఆర్‌ను ఎదురుగా పెట్టుకొనే ఇలా చెప్పేసింది ఆలియా. ఇక దానికి సమాదానంగా ఎన్టీఆర్ కూడా కౌంటర్ ఇచ్చాడు. మేము తెలుగులోనే కాదు ఇంగ్లీష్, హిందీలో కూడా మాట్లాడుతున్నాం. కాకపోతే అది నీకు అర్ధం కావడం లేదంటూ రివర్స్ పంచ్ ఇచ్చాడు. అయితే తారక్ కౌంటర్ ఇచ్చినప్పటికీ ఆలియా మాత్రం తగ్గలేదు. కాదు మీరు ఇంగ్లీష్, హిందీలో మాట్లాడట్లేదని నవ్వుతూనే ఎదురుదాడి చేసింది. గతంలో ప్రభాస్ కూడా సాహో సినిమా ప్రమోషన్ కోసం ముంబై వెళ్లినప్పుడు శ్రద్ధాకపూర్ హీందీ, ఇంగ్లీష్‌లో మాట్లాడుతుంటే ప్రభాస్ ఇంగ్లీష్‌తో మేనేజ్ చేయాల్సి వచ్చింది. వాస్తవంగా తెలుగు, ఇంగ్లీష్‌తో పాటు హీందీలో కూడా తారక్ అనర్గళంగా మాట్లాడగలడని తెలిసిందే. ఇలాంటి సిల్లీ ఇష్యూస్ స్టార్స్ మధ్య సర్వసాదారనమేనని చెప్పవచ్చు. ఇక ఈ విషయం అలా వుంటే.. తాజాగా ఎన్టీఆర్, కొరటాల శివ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నట్టు ఆలియా భట్ అఫీషియల్‌గా ప్రకటించింది. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కాగా పాన్ ఇండియా ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని కొరటాల శివ ఈ కథను రెడీ చేసినట్టు సమాచారం. -
'ఆర్ఆర్ఆర్' వాయిదా పై స్పందించిన రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'ఆర్ఆర్ఆర్' వాయిదా పై స్పంధించారు. తాజాగా 'రౌడీ బాయ్స్' చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా వెళ్ళాడు ఈ హీరో. ఇక ఈవెంట్లో రామ్ చరణ్ చరణ్ మాట్లాడుతూ.. మా సినిమా ఈ సంక్రాంతికి రిలీజ్ కాకపోయినా మాకేం బాద లేదు. ఎందుకంటే అలాంటి చిత్రం సరైన సమయంలో రావాలి. ఆ సినిమా కోసం మూడున్నర సంవత్సరాలు చాలా కష్టపడ్డాం. దాని గురించి దర్శకుడు రాజమౌళి, నిర్మాత దానయ్య నిర్ణయిస్తారని పేర్కొన్నాడు. మాకు సంక్రాంతి ఎంత ముఖ్యమో కాదో మాకు తెలీదు కానీ.. సంక్రాంతి పండుగకి దిల్ రాజు గారు మాత్రం చాలా ముఖ్యం. సంక్రాంతి మమ్మల్ని వదులుకోడానికైనా రెడీగా వుంది కానీ దిల్ రాజుని వదులుకోడానికి రెడీగా లేదు. ఇలాంటి సక్సస్ ఫుల్ సంక్రాంతులు ఎన్నో దిల్ రాజు చూసాడు. ఈ సంక్రాంతి కూడా ఆయనదే అవ్వాలన్నాడు చెర్రి. ఇక మమ్మల్ని ఆదరించినట్టే 'రౌడీ బాయ్స్' చిత్ర హీరో ఆశీష్‌ను కూడా ఆశీర్వధించాలని రామ్ చరణ్ కోరాడు. -
రాజమౌళి ఆర్టిస్ట్‌లను ఎందుకు టార్చర్ పెడతారు?
‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఎలా ఆరంభం అయింది? ఆర్టిస్ట్‌లను రాజమౌళి ఎందుకు టార్చర్ పెడతారు? ఈ సినిమాలో కొమురం భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్, సీత పాత్ర చేసిన ఆలియా భట్ షూటింగ్ ఎక్స్పీరియన్స్ గురించి ఏమన్నారు? ఆలియా తెలుగులో ఏం మాట్లాడారు? అసలు ‘ఆర్ఆర్ఆర్’ విశేషాలేంటి? వచ్చే జనవరి 7న ఈ చిత్రం రిలీజ్ కానున్న సందర్భంగా శనివారం హీరోలు ఎన్టీఆర్, రామ్‌చరణ్, హీరోయిన్ ఆలియా భట్, దర్శకుడు రాజమౌళి, నిర్మాత డీవీవీ దానయ్య మీడియా ముందుకొచ్చారు. ఎన్టీఆర్‌ని చరణ్ గిచ్చడం, చరణ్కన్నా తారక్ ఒక ఏడాది పెద్ద అని రాజమౌళి అంటే, ఇప్పుడు నా వయసు సంగతి ఎందుకు? అని ఎన్టీఆర్ చిరుకోపం ప్రదర్శించడం... ఇలా సరదాగా సాగిన ఈ సమావేశంలో ఎవరేమన్నారో తెలుసుకుందాం. ఇద్దరికీ ఒకేసారి కథ చెప్పా – రాజమౌళి ►ఒక రోజు తారక్, చరణ్‌లను మా ఇంటికి పిలిచాను. ‘మీ ఇద్దరితో సినిమా చేయాలనుకుంటున్నా’నని ‘ఆర్ఆర్ఆర్’ స్టోరీ అవుట్‌లైన్ చెప్పాను. విన్నాక చరణ్, తారక్‌ల ఎక్స్ప్రెషన్స్ మామూలుగా లేవు. సినిమా చేద్దామనుకున్నాక మేం ముగ్గురం ఉన్న ఫోటోను షేర్ చేశాను. ►నేను స్టార్ వేల్యూ తెలిసిన డైరెక్టర్ని. స్టార్లను అభిమానులకు, ప్రేక్షకులకు నచ్చినట్లు చూపిస్తూ ఇంత పెద్ద డైరెక్టర్ అయ్యాను. ప్రేక్షకులను స్టార్స్ థియేటర్లకి రప్పించగలరు. కానీ ఒక్కసారి థియేటర్స్‌లో సినిమా మొదలయ్యాక స్టార్స్ మాయమైపోతారు. కథే ఆ సినిమాను నడిపించాలని నమ్ముతాను. ‘ఆర్ఆర్ఆర్’కు ప్రేక్షకులను రప్పించడానికి స్టార్స్‌గా ఎన్టీఆర్, రామ్‌చరణ్ ఉపయోగపడతారు. కానీ సినిమాలోని కథను, అందులోని పాత్రలను చూపించడానికి ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లోని యాక్టర్స్ కావాలి నాకు. అలా ఎన్టీఆర్, చరణ్‌లోని యాక్టర్స్‌ను తీసుకుని ‘ఆర్ఆర్ఆర్’లో స్నేహాన్ని చూపించగలిగితే సినిమాను చూసేవారు కూడా వారి స్నేహానికి మాత్రమే స్పందిస్తారని, ఎన్టీఆర్, తారక్‌లను కాదని నమ్మి ఈ చిత్రం చేశాను. నా మనసులో అనుకున్నదాన్ని స్క్రీన్ పై తీసుకువచ్చేందుకు చాలా భయపడతాను... మదనపడతాను. విజువల్‌గా నేను ఊహించుకున్న అవుట్‌పుట్ కోసం నా సాంకేతిక నిపుణులను భయపెడతాను.. ఆర్టిస్టులను టార్చర్ పెడతాను. అదృష్టవశాత్తు నేనెంత టార్చర్ పెట్టినా, భయపెట్టినా.. వారు మనసులో నన్ను తిట్టుకున్నా నేననుకున్నది చేసి పెడుతున్నారు. ►‘ఆర్ఆర్ఆర్’ దేశభక్తికి సంబంధించిన సినిమా కాదు. దేశభక్తి అంతర్లీనంగా కనిపిస్తూ, స్నేçహాన్ని చూపించే కథ. బయోపిక్స్ తీస్తే వారికి సంబంధించిన కుటుంబసభ్యులను కలవాలి. కానీ ‘ఆర్ఆర్ఆర్’ కథ 95 శాతం ఢిల్లీలో జరుగుతుంది. స్వాతంత్య్ర సమరయోధులు కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజు ఒకవేళ కలిస్తే ఎలా ఉంటుంది? అనే కల్పిత కథతో తీసిన సినిమా ఇది. అయితే కొమురం భీమ్ పాత్ర కోసం 1920లో ఆదిలాబాద్‌లో నివసించిన గోండు జాతివారి మానసిక స్థితి ఎలా ఉండేది? ఒకవేళ వారికి ఒక కాపరి ఉంటే అతను ఎలా ఉంటాడు? అతను సిటీకి వస్తే ఎలాంటి నడవడికతో ఉంటాడు? అని కసరత్తులు చేశాం. చరణ్ చేసిన అల్లూరి సీతారామరాజు పాత్ర గురించి కూడా పరిశోధన చేశాం. భీమ్ పాత్రలో ఎన్టీఆర్ ముస్లిం యువకుడిగా ఎందుకు క్యాప్ పెట్టుకున్నాడనే విషయాన్ని సినిమాలో చూపిస్తాం. ►ఈ సినిమాలో రామ్, భీమ్ అనే రెండు పాత్రలు ఉన్నాయి. ఆ పాత్రలకు నా కథ వర్కౌట్ అవ్వాలంటే హీరోలిద్దరి క్యారెక్టర్స్ పట్ల సమాన దృక్పథంతో ఉండాలి. ఈ ఇద్దరూ నవ్వితే ప్రేక్షకులూ నవ్వాలి.. ఏడిస్తే ఏడవాలి. అంతేకానీ తారక్‌కు ఎక్కువ ఫైట్స్ ఉన్నాయా? ఎన్టీఆర్‌కు ఎక్కువ ఫైట్స్ ఉన్నాయా? అని కాదు. అయితే వీటి గురించి అభిమానుల్లో, ప్రేక్షకుల్లో అంచనాలు ఉంటాయి. కానీ ప్రేక్షకులు థియేటర్స్‌లో వీటి గురించి మర్చిపోతారనే అనుకుంటున్నాను. ‘ఆర్ఆర్ఆర్’లో రొమాన్స్ కన్నా.. బ్రోమాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇద్దరి స్నేహితుల అనుబంధాన్ని ఇలా కూడా తీయవచ్చా? అనేలా బ్రోమాన్స్ ఉంటుంది. ►స్వాతంత్య్ర సమరయోధులతో ‘నాటు నాటు’ పాటలో డ్యాన్స్ చేయించారనే విమర్శలు వస్తాయని ఊహించాను. కానీ ఇంతటి నాటు పాటలో కూడా ఎమోషన్ ఉంటుంది. ఈ పాటను థియే టర్స్‌లో చూసినప్పుడు స్వాతంత్య్ర సమరయోధుల పేర్లు పెట్టుకున్న ఇద్దరు డ్యాన్స్ చేస్తున్నారన్న ఆలోచన ప్రేక్షకులకు రాదు. ►‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారు ‘దోస్తీ’ పాట రాశారు. కథ, అందులోని పాత్రలు, పాట వచ్చే సందర్భాలను వివరించినప్పుడే సిరివెన్నెల సీతారామశాస్త్రిగారితో పాట రాయించుకోగలం. ►తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో మాత్రమే ఎన్టీఆర్, చరణ్ డబ్బింగ్ చెప్పారు. మిగతా భాషలు, విదేశీ భాషల్లో ఆ భాషల ఆర్టిస్టులు డబ్బింగ్ చెప్పారు. రాజమౌళిగారు కనిపించని టైగర్ – ఎన్టీఆర్ గోండ్లలో జన్మించిన వ్యక్తి జీవనశైలి, ప్రవర్తన, నడవడిక ఎలా ఉంటుంది? ఇవన్నీ రాజమౌళిగారు చెప్పారు. కొమురం భీమ్ పాత్రను అర్థం చేసుకోవడానికి ఆయన బాగా హెల్ప్ చేశారు. నేను కూడా మెంటల్‌గా, ఫిజికల్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యాను. అన్ని సినిమాలకు కష్టపడతాను. కాకపోతే ఈ సినిమాకు కాస్త ఎక్కువగా కష్టపడ్డాను. ‘ఆర్ఆర్ఆర్’ సెట్స్‌లో కనిపించని టైగర్ రాజమౌళిగారే. రాజమౌళి వంటి గొప్ప దర్శకుడు యాక్టర్స్‌గా మాకు గొప్ప హైప్ ఇస్తాడని కథను ఒప్పుకుంటాం. అంతేకానీ ఈ సినిమాతో ఇతర భాషల్లోకి కూడా వెళ్లొచ్చని ఆలోచించం. ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతుందంటే అది బోనస్ మాత్రమే. ఈ సినిమా చేస్తున్న టైమ్‌లో మేం (రామ్‌చరణ్‌ని ఉద్దేశించి) ఫ్రెండ్స్ అవ్వలేదు... అంతకుముందే ఫ్రెండ్స్. అలా చేస్తే వంద మార్కులు పడ్డట్లే!– రామ్‌చరణ్ ఈ సినిమాలో నా క్యారెక్టర్లో మూడు షేడ్స్ ఉన్నాయి. ప్రతి షేడ్‌కి కావాల్సిన భావోద్వేగాన్ని రాజమౌళిగారు స్క్రిప్ట్‌లో డిజైన్ చేశారు. సినిమా అంతా ఒకే ఫిజిక్ మెయిన్టైన్ చేయడానికి చాలా కష్టపడ్డాను. రాజమౌళిగారితో వర్క్ చేయడం ప్రత్యేకంగా ఉంటుంది. ఆయన చెప్పింది యాక్టర్స్‌గా మేం చేస్తే అదే మాకు వంద మార్కులు. చిన్న చిన్న విభేదాలు వచ్చిన తర్వాత కూడా స్నేహం బలంగా ఉన్నప్పుడే అది నిజమైన స్నేహం అవుతుంది. ‘ఆర్ఆర్ఆర్’ చేస్తున్నాం కాబట్టి మేం (ఎన్టీఆర్‌ని ఉద్దేశించి) స్నేహితు లయ్యాం అని కాదు. ముందే ఫ్రెండ్స్. రాజమౌళిగారికి మేం చేసింది ఒక్కటే... స్క్రిప్ట్‌లో మా స్నేహాన్ని వెండితెరపై బాగా తీసుకురావడమే మేం చేసింది. మాకు పిచ్చెక్కిపోయింది – ఆలియా సౌత్ సినిమాల్లో నటించకూడదని ఏ బాలీవుడ్ హీరోయిన్ అనుకోదు. కథ నచ్చితే చేస్తారు. అలాగే నేను కూడా ‘ఆర్ఆర్ఆర్’లో భాగమయ్యాను. దక్షిణాది ప్రేక్షకులను ఇంప్రెస్ చేయాలని నన్ను నేను చాలెంజ్ చేసుకున్నాను. ఎన్టీఆర్, చరణ్ లవ్లీ కో స్టార్స్. చాలా హెల్ప్ చేశారు. రాజమౌళిగారితో వర్క్ చేయడంతో నా కల నిజమైనట్లుంది. ఆయనతో మరో సినిమా చేయాలని ఉంది. అలాగే ఐ లవ్ ‘ఆర్ఆర్ఆర్’ (లవర్ రణ్‌బీర్ కపూర్‌ని ఉద్దేశించే ఆలియా ఇలా అన్నారని ఓ ఊహ). స్క్రిప్ట్ విన్నప్పుడు అందులోని కొన్ని భావాలను ఓ యాక్టర్‌గా కెమెరా ముందు చూపించడం అన్ని వేళలా కుదరదు. కానీ ‘ఆర్ఆర్ఆర్’ వల్ల ఈ విషయంలో నేను మెరుగయ్యాను. రాజమౌళిగారి సినిమాల్లో ఎమోషన్ స్ట్రాంగ్‌గా ఉంటుందని తెలుసుకున్నాను. కరోనా టైమ్‌లో తెలుగు భాష నేర్చుకోవడానికి జూమ్‌లో క్లాసులకు హాజరయ్యాను’’ అంటూ ‘‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ పగిలిపోయింది. ముంబైలో మాకు పిచ్చెక్కిపోయింది’’ అని తెలుగులో మాట్లాడి అలరించారు ఆలియా. -
ఆర్ఆర్ఆర్ మూవీ: ఇంట్రస్టింగ్ అప్డేట్స్, ట్రైలర్ గూస్ బంప్స్ అంతే!
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ టాప్ స్టార్స్, దర్శక దిగ్గజం రాజమౌళి కాంబినేషన్లో పాన్ ఇండియా చిత్రంగా రూపు దిద్దుకుంటున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ఆర్ఆర్ఆర్. బిగ్ స్క్రీన్‌పై తొలిసారి స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, మెగా హీరో రామ్‌చరణ్ ఫ్యాన్స్‌కు మెగా ట్రీట్ ఇవ్వబోతున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే ఫస్ట్‌లుక్ సాంగ్స్, మేకింగ్ వీడియోలు ఫ్యాన్స్‌కు మంచి కిక్కు ఇవ్వగా, థియేటర్లలో రిలీజైన ట్రైలర్ మరింత హంగామా సృష్టిస్తోంది. ఆర్ఆర్ఆర్ (రౌద్రం, రణం, రుధిరం) ట్రైలర్‌తో జక్కన్న సర్‌ప్రైజ్‌కి ఫ్యాన్స్ ఫిదా. గూస్ బంప్స్ అంతే తెగ సంబర పడిపోతున్నారు. ‘‘పులిని పట్టుకోవాలంటే వేటగాడు కావాలి. ఆ పనిచేయగలిగింది ఒక్కడే సార్’’ ‘‘పానం కన్నా నీ సోపతి నా సొంతం..’’ తొంగి..తొంగి నక్కి నక్కి గాదే... తొక్కుకుంటూ పోవాలే.. ఎదురు వచ్చినోడిని ఏసుకుంటూ పోవాలే..’’ ‘‘కుంభస్థలాన్ని బద్దలుకొడదాం పద..’’ ఇలా పవర్ఫుల్ డైలాగ్స్‌తో మరో సెన్సేషన్‌కు రాజమౌళి బాటలు వేసేసాడు. తాజాగా సమాచారం ప్రకారం ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ లభించింది. దాదాపు మూడు గంటల ఆరు నిమిషాల 54 సెకన్ల నిడివితో ఆర్ఆర్ఆర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆర్ఆర్ఆర్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 7న థియేటర్లలోకి రాబోతోంది. దాదాపు రూ. 400 కోట్లతో ఈ మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. #RRR (UA 187) already Cleared Censors Uncut according to the CBFC Portal!. #RRRMovie pic.twitter.com/fo2Qszuf4H — AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) December 8, 2021 BIG DAY !! Theatres will erupt in few hours…. 🌋🌋💥💥#RRRTrailerDay #RRRTrailer #RRRMovie pic.twitter.com/TEb5BPCgaL — RRR Movie (@RRRMovie) December 9, 2021 Hyderabad &Nizam RRR Theatre List @tarak9999 #ManOfMassesNTR pic.twitter.com/fYoLIeuMlb — Nandipati MuRRRali🌊 (@NtrMurali9999) December 7, 2021 -
ఆర్ఆర్ఆర్ : పవర్ఫుల్ లుక్‌లో అజయ్ దేవగన్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం రౌధ్రం రణం రుధిరం (ఆర్ఆర్ఆర్). ఈ సినిమాలో అజయ్ దేవగన్ జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల గురువుగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అదికూడా ఫ్లాష్‌బాక్ సీన్లలో కనిపించనున్నట్లు సమాచారం. అతనికి జంటగా శ్రియ శరణ్ నటించనుంది శుక్రవారం (ఏప్రిల్2)న ఆయన పుట్టినరోజు కావడంతో ఆర్ఆర్ఆర్లో అజయ్ దేవగన్ ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇప్పటికే ఎన్టీఆర్,రామ్‌చరణ్, ఒలివియా, ఆలియాభట్ ఫస్ట్‌లుక్‌లను చిత్రబృందం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, రామ్ చరణ్ ‘భీం ఫర్ రామరాజు', ఎన్టీఆర్ ‘రామరాజు ఫర్ భీం' వీడియోలు రికార్డులు క్రియేట్ చేయడంతో పాటు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. 'బాహుబలి' తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న తొలి సినిమా కావడం, స్వాతంత్ర్య సమరవీరుల పాత్రల్లో ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తుండటంతో ఆర్ఆర్ఆర్ పై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. దసరా కానుకగా అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం. Empowering his people is his defining characteristic. His strength lies in his emotion. Presenting the poweRRRful avatar of @ajaydevgn in #RRRMovie.https://t.co/2cwcGGl7BF#HappyBirthdayAjayDevgn#AjayDevgn #RRR @ssrajamouli @tarak9999 @AlwaysRamCharan @aliaa08 @DVVMovies — RRR Movie (@RRRMovie) April 2, 2021 చదవండి : రాజమౌళి నిర్ణయంతో వకీల్‌సాబ్ నిర్మాత అప్సెట్! ఆర్ఆర్ఆర్ : రామ్‌చరణ్ ఫ్యాన్స్‌కి గిఫ్టిచ్చిన రాజమౌళి -
ఆర్ఆర్ఆర్ టీం : రాజమౌళిపై ఇన్ని ఆరోపణలా!
సాక్షి, హైదరాబాద్: దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళికి ఆర్ఆర్ఆర్ టీం వెరైటీగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. ఈ మేరకు మూవీ టీం ఒక వీడియో విడుదల చేసింది. ప్రతి సీన్‌ని పవర్‌ఫుల్‌గా ఎలివేట్ చేయాలని అనుకుంటారు. ఎమోషన్స్ రూపంలో సినిమా థ్రిల్స్ ఇవ్వడానికి ఇష్టపడే దర్శకుడు అంటూ ప్రశంసిస్తూ ఆయనకు ఒక చిరు కానుకను అందించింది. హ్యాపీ బర్తడే సార్.. లాంగ్ లివ్ సార్ అంటూ రొటీన్ డైలాగులకు భిన్నంగా ఆయన పనితీరును, ఆయనలోని నిబద్ధతను ఎలివేట్ చేస్తూ, పర్ఫెక్షనిజానికి ఫిదా అవుతూ వర్చువల్ విషెస్ చెప్పడం ఆసక్తికరంగా నిలిచింది. (ఆర్ఆర్ఆర్ అప్డేట్ వచ్చేసింది) ముఖ్యంగా మెగాహీరో రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. దర్శక రాక్షసుడు చంపేస్తున్నారంటూ ఎన్టీఆర్ వ్యాఖ్యానించారు. ఒక్క షాట్ కు మూడుగంటలు.. అదీ జక్కన్న చెక్కుడు.. ఆయన పర్ఫెక్షన్తో మమ్మల్ని చావగొట్టేస్తున్నారని ఎన్టీఆర్ పేర్కొన్నారు. అంతేనా సంగీత దర్శకుడు కీరవాణి, సెంథిల్ కుమార్‌తో పాటు చిత్ర బృందం చేసిన చిలిపి ఆరోపణలను ఒకసారి మీరు కూడా చూసేయండి మరి. మరోవైపు బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలను అందించిన దర్శక ధీరుడు రాజమౌళికి సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, నటీనటులుతో పాటు, ఇతర సెలబ్రిటీలు, అభిమానుల అభినందనల వెల్లువ కురుస్తోంది. A small gift from team #RRRMovie to the man who only loves to give us all cinematic thrills in the form of elevations and emotions, but is against anyone giving him birthday wishes! Happy Birthday, captain! 🤗 @ssrajamouli https://t.co/flBj6Z5z85#HBDSSRajamouli — 𝗥𝗥𝗥 𝗠𝗼𝘃𝗶𝗲 (@RRRMovie) October 10, 2020 -
ఆర్ఆర్ఆర్ ఆరంభం
ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం). సుమారు 400 కోట్ల బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో కొమురమ్ భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్ నటిస్తున్నారు. ఎన్టీఆర్‌కి జోడీగా హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్, రామ్‌చరణ్‌కి జోడీగా హిందీ నటి ఆలియా భట్ కనిపించనున్నారు. శ్రియ, అజయ్ దేవగన్, సముద్రఖని ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఏడు నెలల కరోనా లాక్డౌన్ తర్వాత ఈ సినిమా చిత్రీకరణ నేటి నుంచి (అక్టోబర్ 5) హైదరాబాద్‌లో జరగనుంది. షూటింగ్లో పాల్గొనే ముఖ్య నటీనటులందరూ కొన్ని రోజులుగా స్వీయ క్వారంటైన్లో ఉన్నారని సమాచారం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సెంథిల్ కుమార్ కెమెరామేన్. -
తేదీ మారిందా?
‘‘నా సినిమా బావుంటుంది అని గ్యారెంటీగా చెప్పగలను కానీ ఎప్పుడు విడుదల వుతుందో మాత్రం గ్యారెంటీగా చెప్పలేను’’ అని దర్శకుడు రాజమౌళి తన సినిమా రిలీజ్ డేట్స్‌పై సరదాగా జోక్ చేస్తుంటారు. దానికి కారణం ఆయన సినిమాలన్నీ అనుకున్న తేదీకి ఎక్కువ శాతం విడుదల కాకపోవడమే. ఇప్పుడు తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ కూడా ముందుగా ప్రకటించిన తేదీకి కాకుండా వేరే డేట్‌కి రిలీజ్ కానుందనే టాక్ నడుస్తోంది. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న పీరియాడికల్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్, చరణ్ సరసన బాలీవుడ్ నటి ఆలియా భట్ నటిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మాత. ప్రస్తుతం వికారాబాద్ అడవుల్లో ఎన్టీఆర్, చరణ్‌లపై ఓ యాక్ష¯Œ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. మొదట ఈ సినిమాను ఈ ఏడాది జూలై 31న విడుదలæ చేయాలనుకున్నారు. ఇప్పుడు అక్టోబర్ 2న విడుదల కానుందని తెలిసింది. అక్టోబర్ 2 నేషనల్ హాలిడే (గాంధీ జయంతి) కావడంతో ‘ఆర్ఆర్ఆర్’ భారీ ఓపెనింగ్స్ కొల్లగొడుతుందని ఊహించవచ్చు. సుమారు 10 భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. -
‘ఫిల్మ్ హెరిటేజ్ పౌండేషన్ ’
-
సినీ చరిత్రను పరిరక్షించుకోవాలి
‘‘మనకెంతో విలువైన సినీ వారసత్వ సంపద ఉంది. కానీ, దాన్ని ఎలా పరిరక్షించుకోవాలో తెలియకపోవడం బాధాకరం. ఆ పనిని ‘ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్’ ఎంతో చక్కగా నిర్వహించడంతో పాటు, వాటిని ఎలా భద్రపరచాలన్న అంశంపై శిక్షణ ఇస్తోంది. మన సినీ చరిత్రని పరిరక్షించుకోవడం ద్వారా భావి తరాలకు మన సంస్కృతిని అందించగలుగుతాం’’ అని లెజెండరీ దర్శకులు శ్యామ్ బెనగల్ అన్నారు. భారతీయ, తెలుగు సినీ వారసత్వ పరిరక్షణ ప్రాముఖ్యతను తెలియజేసే ఉద్దేశంతో ‘ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్, ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ అర్కీవ్స్) (ఎఫ్ఐఎఎఫ్) సంయుక్తంగా ఆదివారం నుంచి ఈ నెల 15 వరకు హైదరాబాద్‌లో ప్రత్యేక వర్క్ షాప్ నిర్వహిస్తున్నాయి. ఈ ప్రారంభ వేడుకలో శ్యామ్ బెనగల్ మాట్లాడుతూ– ‘‘సినిమాలు మన జీవితాల్లో అంతర్భాగం. వాటిని భద్రపరచడమనేది మన దృశ్యపరమైన చరిత్రను, మన వారసత్వాన్ని, జ్ఞాపకాలను భద్రపరచడంతో సమానం. ఈ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతుండాలి. దీనికి ప్రభుత్వాల నుంచి సహాయ సహకారాలు కావాలి’’ అన్నారు. హీరో చిరంజీవి మాట్లాడుతూ–‘‘నేను రాజకీయాల్లోకి వెళ్లాక ఓ నిర్మాత నాకు అరుదైన కానుక ఇచ్చారు. నన్ను స్టార్ హీరోగా నిలబెట్టిన ‘ఖైదీ’ నెగిటివ్ రైట్స్ నాకు కానుకగా ఇచ్చారు. కానీ, అవి నాకు ఏ ల్యాబ్‌లో దొరక్కపోవడంతో బాధపడ్డా. ఈ తరంలో ఎంత మందికి రాజ్‌కపూర్, చిత్తూరు నాగయ్య, ఎల్వీ ప్రసాద్ వంటి వాళ్లు తెలుసు.. వాళ్లు అందించిన విలువైన సినీ సంపదను భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది’’ అన్నారు. హీరో నాగార్జున మాట్లాడుతూ– ‘‘నాన్నగారు(అక్కినేని నాగేశ్వరరావు) దాదాపు 400కు పైగా చిత్రాల్లో నటించారు. కానీ, వాటిలో మేం కొన్ని కూడా భద్రపరచుకోలేక పోయాం.. ఇది చాలా బాధగా ఉంది. వాటిని దాచుకోవాలన్న ఆలోచన కూడా మాకెప్పుడూ రాలేదు. నా ‘గీతాంజలి’, ‘శివ’ చిత్రాల నెగిటివ్ రీల్స్ ఇప్పుడు లేవు. కానీ, ఇక నుంచైనా మన సినీ వారసత్వ సంపదను కాపాడుకోవాలి’’ అన్నారు. డైరెక్టర్ రాజమౌళి మాట్లాడుతూ– ‘‘ప్రస్తుతం అందరం డిజిటల్ మీడియాలో చిత్రాలు తెరకెక్కిస్తున్నాం.కానీ, వాటిని భద్రపరచుకోలేకపోతున్నాం. ‘మగధీర’ను భద్రపరచమని ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ స్థాపకులు శివేంద్రగారు నన్ను అడిగారు. నేను చేస్తా అన్నాను.. అప్పడు డిజిటల్లో 4కె రిజల్యూషన్ ఉన్న ఆ చిత్రం ఇప్పుడు 2కె రిజల్యూషన్‌కి పడిపోయింది. నాణ్యతను కోల్పోకుండా ఉండాలంటే సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది’’ అన్నారు. డైరెక్టర్ రాఘవేంద్రరావు, నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్‌బాబు, టి.సుబ్బరామి రెడ్డి, నటి అమల పాల్గొన్నారు. -
డబుల్ ధమాకా
ఎన్టీఆర్, రామ్‌చరణ్ మంచి డ్యాన్సర్లు. కష్టమైన స్టెప్పులను కూడా సునాయాసంగా వేసి, అభిమానులతో విజిల్స్ కొట్టించగలరు. ఇదే హైలెట్ పాయింట్‌ను ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’లో ఉపయోగించనున్నారట దర్శకుడు రాజమౌళి. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న పీరియాడికల్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరమ్ భీమ్‌గా, చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్చరణ్లమీద ఓ జానపద పాట ఉండబోతోందని, ఇందులో ఇద్దరూ కలసి కాలు కదపనున్నారని తెలిసింది. ఇదే నిజమైతే ఈ హీరోల అభిమానులకు స్టెప్పుల విందే అని ఊహించొచ్చు. ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. చరణ్‌కి జోడీగా ఆలియా భట్ నటించనున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జూలైలో విడుదల కానుంది. -
కోర్టులో అల్లూరి
కోర్టు బోనులో నిలబడి వాదిస్తున్నారు రామ్‌చరణ్. ఈ వాడివేడి వాదనను వచ్చే ఏడాది జూలైలో విడుదల కానున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో చూడొచ్చు. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇందులో స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు పాత్రను చరణ్, కొమరం భీమ్ పాత్రను ఎన్టీఆర్ చేస్తున్నారు. ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు పాత్రకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. కోర్టులో అల్లూరి తన వాదన వినిపించే సీన్స్ తీయడం కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో కోర్టు సెట్ వేశారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జూలైలో విడుదల కానుంది. -
గురూ... యాక్షన్ షురూ
మళ్లీ ఫైటింగ్ షురూ చేశారట ఎన్టీఆర్ అండ్ రామ్‌చరణ్. ‘బాహుబలి’ వంటి సూపర్ డూపర్ హిట్ మూవీ తర్వాత రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్ (వర్కింగ్ టైటిల్)’. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా ఈ మల్టీస్టారర్ మూవీని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇటీవల రామ్‌చరణ్‌పై కొన్ని పోరాట సన్నివేశాలను చిత్రీకరించారని తెలిసింది. ఆ తర్వాత చిన్న బ్రేక్ తీసుకున్న ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ మళ్లీ ఇప్పుడు షూటింగ్ షురూ చేసింది. ఈ సెట్లోకి గురువారం ఎన్టీఆర్ ఎంటరయ్యారు. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో పాటుగా కీలక తారాగణంపై ముఖ్య సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలిసింది. ఫస్ట్ షెడ్యూల్లో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లపై ఓ పవర్ఫుల్ యాక్షన్ ఎపిసోడ్‌ను తీశారు. తాజా షెడ్యూల్లో కూడా వీరి కాంబినేషన్లో ఓ భారీ ఫైట్ తీయబోతున్నారట. ఇక ఈ సినిమాలో కథానాయికలుగా బాలీవుడ్ భామలు ఆలియా భట్, పరిణీతీ చోప్రాల పేర్లు తెరపైకి వచ్చాయి. సముద్రఖని, రాహుల్ రామకృష్ణ తదితరులు నటిస్తున్న ఈ పీరియాడికల్ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. -
రాజమౌళి సినిమా కోసం ప్రిపరేషన్ స్టార్ట్!
‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రం సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు ఎన్టీఆర్. గత కొన్ని నెలలుగా ఈ సినిమాను ఫుల్ టైట్ షెడ్యూల్స్‌తో ఏకధాటిగా పూర్తి చేశారాయన. ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎన్టీఆర్ ఓ హాలిడే తీసుకుంటారని ఊహించారు. కానీ, నో హాలిడే అంటున్నారాయన. రాజమౌళితో చేయబోయే సినిమా లుక్ కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి సిద్ధం అవుతున్నారట. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ అనేది వర్కింగ్ టైటిల్. ఈ సినిమాలో ఇద్దరి హీరోల లుక్స్ పూర్తిగా సరికొత్తగా ఉండనున్నాయట. ఈ లుక్ కోసం ఎన్టీఆర్ సుమారు 45రోజుల పాటు కఠినమైన శారీరక శిక్షణ తీసుకోబోతున్నారట. వచ్చే నెల 15 నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. 2020లో ఈ సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. -
లొకేషన్ సెర్చ్
అక్కడికి, ఇక్కడికి ఎక్కడ బాగుందంటే అక్కడికి వెళ్తున్నారట రాజమౌళి. ఏం బాగుండాలి అంటే ప్లేస్ విశాలంగా ఉండాలట. ఎందుకు? అంటే..‘ఆర్ఆర్ఆర్’ మూవీ సెట్ కోసం. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ‘బాహుబలి’ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా ఓ మల్టీస్టారర్ మూవీ రూపొందనున్న సంగతి తెలిసిందే. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించనున్నారు. ఈ సినిమాకు ‘ఆర్ఆర్ఆర్’ అనే వర్కింగ్ టైటిల్‌ను అనుకుంటున్నారు. ఈ సినిమా కోసం భారీ సెట్ వేసేందుకు కెమెరామెన్ సెంథిల్ కుమార్‌తో కలిసి లొకేషన్స్ సెర్చ్ చేస్తున్నారు రాజమౌళి. రీసెంట్గా హైదరాబాద్‌కు సమీపంలోని కొల్లూరు గ్రామ పరిసర ప్రాంతాలను టీమ్ పరిశీలించారని సమాచారం. ప్రస్తుతం బోయపాటి సినిమాతో రామ్‌చరణ్, త్రివిక్రమ్ సినిమాతో ఎన్టీఆర్ బిజీగా ఉన్నారు. అక్టోబర్‌లో ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అవుతుంది. రామ్‌చరణ్ సినిమా కూడా అక్టోబర్ నాటికి ఓ కొలిక్కి వస్తుంది. సో.. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా నవంబర్‌లో మొదలయ్యే అవకాశాలు ఉంటాయని ఊహించవచ్చు.