రాజమౌళి సినిమా కోసం ప్రిపరేషన్‌ స్టార్ట్‌! | Jr NTR Allots Extended call Sheet To Rajamouli's RRR | Sakshi
Sakshi News home page

నో హాలిడే

Published Tue, Oct 16 2018 12:27 AM | Last Updated on Tue, Oct 16 2018 9:54 AM

Jr NTR Allots Extended call Sheet To Rajamouli's RRR - Sakshi

ఎన్టీఆర్

‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రం సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు ఎన్టీఆర్‌. గత కొన్ని నెలలుగా ఈ సినిమాను ఫుల్‌ టైట్‌ షెడ్యూల్స్‌తో ఏకధాటిగా పూర్తి చేశారాయన. ఈ సినిమా రిలీజ్‌ తర్వాత ఎన్టీఆర్‌ ఓ హాలిడే తీసుకుంటారని ఊహించారు. కానీ, నో హాలిడే అంటున్నారాయన. రాజమౌళితో చేయబోయే సినిమా లుక్‌ కోసం ప్రిపరేషన్‌ స్టార్ట్‌ చేయడానికి సిద్ధం అవుతున్నారట.

ఎన్టీఆర్, రామ్‌ చరణ్‌ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్‌ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అనేది వర్కింగ్‌ టైటిల్‌. ఈ సినిమాలో ఇద్దరి హీరోల లుక్స్‌ పూర్తిగా సరికొత్తగా ఉండనున్నాయట. ఈ లుక్‌ కోసం ఎన్టీఆర్‌ సుమారు 45రోజుల పాటు కఠినమైన శారీరక శిక్షణ తీసుకోబోతున్నారట. వచ్చే నెల 15 నుంచి ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ కానుంది. 2020లో ఈ సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement