
‘ఆచార్య, ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రాల షూటింగ్స్‌ను భలేగా బ్యాలెన్స్ చేస్తున్నారు రామ్‌చరణ్. ఖమ్మంలో ‘ఆచార్య’ షూటింగ్‌ను పూర్తి చేసిన చరణ్ చిన్న బ్రేక్ తీసుకుని, తాజాగా ‘ఆర్‌ఆర్‌ఆర్’ సెట్స్‌లో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ చిత్రం నైట్ షూట్ జరుగుతోంది. శనివారం నుంచి రామ్‌చరణ్‌కు సంబంధించిన సన్నివేశాలను తెరకెక్కిస్తారని సమాచారం. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రూపొందుతున్న సినిమా ‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్‌ఆర్‌ఆర్). ఒలీవియా మోరిస్, ఆలియా భట్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. స్వాతంత్య్ర సమరయోధులు కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్ కనిపిస్తారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా ఈ ఏడాది అక్టోబరు 13న విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment