
మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. కేఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని ఇటీవల ఓ సందర్భంలో ఈ చిత్ర కథారచయిత విజయేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ఫారెస్ట్ అడ్వెంచరస్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమా కోసం మహేశ్‌బాబు సరికొత్తగా మేకోవర్ అవుతున్నారు.
మహేశ్ జుట్టు పెంచుతున్నారు. అలాగే బరువు కూడా పెరుగుతున్నారట. కాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రోడక్షన్ వర్క్స్‌ను పూర్తి చేసి, సెప్టెంబరులో చిత్రీకరణను మొదలుపెట్టేలా ప్లాన్ చేస్తున్నారట రాజమౌళి. అలాగే ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుందని, ఈ రెండు భాగాలను ఒకేసారి చిత్రీకరించేలా రాజమౌళి ప్లాన్ చేస్తున్నారని భోగట్టా.
Comments
Please login to add a commentAdd a comment