ఆర్‌ఆర్‌ఆర్‌ మేనియా: రామ్‌ చరణ్‌పై ఆనంద్‌ మహీంద్ర ట్వీట్‌ వైరల్‌! | RRR Mania Anand Mahindra lauds Ram Charan Global Star | Sakshi
Sakshi News home page

ఆర్‌ఆర్‌ఆర్‌ మేనియా: రామ్‌ చరణ్‌పై ఆనంద్‌ మహీంద్ర ట్వీట్‌ వైరల్‌!

Published Sat, Feb 25 2023 3:22 PM | Last Updated on Sat, Feb 25 2023 4:53 PM

RRR Mania Anand Mahindra lauds Ram Charan Global Star - Sakshi

సాక్షి,ముంబై: పారిశ్రామికవేత్త, ఎంఅండ్‌ఎం ఆనంద్‌మహీంద్ర ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రభంజనంపై స్పందించారు.సోషల్‌ మీడియాలో ఎపుడూ తరచుగా ఉండే ఆయన తాజాగా  టాలీవుడ్‌ మెగా హీరో రామ్  చరణ్‌పై  ప్రశంసలు కురిపించారు. మెగా పవర్‌ స్టార్‌ను గ్లోబల్‌ స్టార్‌ అంటూ కితాబిచ్చారు.  ఈ సందర్భంగా ఒక వీడియోను కూడా ఆయన షేర్‌ చేశారు. 

 గుడ్ మార్నింగ్ అమెరికా అనే  పాపులర్‌ టీవీ షోలో పాల్గొన్న తొలి భారతీయ నటుడిగా రామ్ చరణ్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే  దాంతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్‌గా అందరూ పొగిడేస్తున్నారు. దీంతో ఆనంద్ మహీంద్రా కూడా ట్వీట్‌  చేశారు.  గుడ్ మార్నింగ్ అమెరికా సోషల్ మీడియా పోస్టును రీట్వీట్ చేసిన ఆయన రామ్‌ చరణ్‌ గ్లోబల్ స్టార్ అంటూ కొనియాడటం విశేషం.  ప్రముఖ దర్శకుడు రాజమౌళి  దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్  మూవీ అంతర్జాతీయ పలు అవార్డులతో ప్రపంచ ఖ్యాతిని దక్కించుకుంటోంది.దీంతో ఆ మూవీ హీరో జూఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ గ్లోబల్‌ స్టార్స్‌గా మారిపోయారు. ముఖ్యంగా జేమ్స్ కామెరాన్ వంటి దర్శక దిగ్గజం రామ్ చరణ్ నటనను ప్రత్యేకంగా ప్రస్తావించడం గమనార్హం. 

మరోవైపు ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీతో  పాన్ ఇండియా స్టార్ హీరో రామ్ చరణ్ మరో అరుదైన ఘనతను తన సొంతం చేసుకున్నారు. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు ఫంక్షన్ ప్రెజెంటర్‌గా రామ్ చరణ్  బెస్ట్ వాయిస్ ఓవర్ అవార్డును ప్రకటించారు. అలాగే ఈ మూవీ సినిమా ఏకంగా నాలుగు అవార్డులను అందుకుంది. బెస్ట్ మూవీ, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్, బెస్ట్ స్టంట్స్, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డులు అందుకుంది. గతంలో  హెచ్‌సీఏ స్పాట్ లైట్ అవార్డును కూడా ప్రకటించడంతో, మొత్తం ఐదు  అవార్డులను ఈ మూవీ దక్కించుకుంది. కాగా మార్చ్ 12న జరిగే ఆస్కార్ అవార్డ్స్ ఫంక్షన్ కోసం ఇప్పటికీ చిత్రబృందం అమెరికా చేరుకుంది. అంతేకాదు మార్చ్ 16న  ప్రకటించ నున్న  క్రిటిక్స్ సూపర్ అవార్డ్స్ ఉత్తమ నటుడు అవార్డుకు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నామినేట్ అయ్యారు. దీనిపై  రామ్‌చరణ్‌ ట్వీట్‌ చేశారు కూడా. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement