Alia Bhatt Comments On Jr. NTR At RRR Press Meet | Alia Bhatt Complaints Jr Ntr - Sakshi
Sakshi News home page

నీ భాష నాకు అర్ధం కాదు.. ఎన్టీఆర్‌పై ఆలియా భట్‌ పంచ్‌!

Published Fri, Feb 4 2022 12:14 AM | Last Updated on Fri, Feb 4 2022 8:23 AM

Alia Bhatt Comments On Junior NTR At RRR Press Meet - Sakshi

రాజమౌళి చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ద్వారా బాలీవుడ్‌ బ్యూటి ఆలియా భట్ తెలుగు తెరకు పరిచయమవుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా  ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ప్రమోషన్‌లో బాగంగా జరిగిన ఓ ప్రెస్‌మీట్‌లో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌పై ఆలియా సెటైర్‌ వేసింది.

జూ.ఎన్టీఆర్ ఎక్కడికి వచ్చినా ఎక్కువగా తెలుగులోనే మాట్లాడుతున్నాడని..అది తనకు అర్దం కావడం లేదని చెప్పింది. అయితే దానిని ఎవరైనా అనువదించి తనకు చెప్తారేమోనని దిక్కులు చూడాల్సి వస్తోందంటూ చెప్పుకొచ్చింది. ఓ ప్రెస్‌మీట్‌లో ఎన్టీఆర్‌ను ఎదురుగా పెట్టుకొనే ఇలా చెప్పేసింది ఆలియా.

ఇక దానికి సమాదానంగా ఎన్టీఆర్‌ కూడా కౌంటర్‌ ఇచ్చాడు. మేము తెలుగులోనే కాదు ఇంగ్లీష్, హిందీలో కూడా మాట్లాడుతున్నాం. కాకపోతే అది నీకు అర్ధం కావడం లేదంటూ రివర్స్‌ పంచ్‌ ఇచ్చాడు. అయితే తారక్‌ కౌంటర్‌ ఇచ్చినప్పటికీ ఆలియా మాత్రం తగ్గలేదు. కాదు మీరు ఇంగ్లీష్, హిందీలో మాట్లాడట్లేదని నవ్వుతూనే ఎదురుదాడి చేసింది. 

గతంలో ప్రభాస్ కూడా సాహో సినిమా ప్రమోషన్‌ కోసం ముంబై వెళ్లినప్పుడు శ్రద్ధాకపూర్‌ హీందీ, ఇంగ్లీష్‌లో మాట్లాడుతుంటే ప్రభాస్‌ ఇంగ్లీష్‌తో మేనేజ్‌ చేయాల్సి వచ్చింది. వాస్తవంగా తెలుగు, ఇంగ్లీష్‌తో పాటు హీందీలో కూడా తారక్‌ అనర్గళంగా  మాట్లాడగలడని తెలిసిందే. ఇలాంటి సిల్లీ ఇష్యూస్‌ స్టార్స్‌ మధ్య సర్వసాదారనమేనని చెప్పవచ్చు. ఇక ఈ విషయం అలా వుంటే.. తాజాగా ఎన్టీఆర్‌, కొరటాల శివ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నట్టు ఆలియా భట్ అఫీషియల్‌గా ప్రకటించింది. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కాగా పాన్ ఇండియా ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని కొరటాల శివ ఈ కథను రెడీ చేసినట్టు సమాచారం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement