Ethara Jenda Full Song Out: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్లుగా తెరకెక్కిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. రాజమౌళి దర్శకత్వం రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. 11 వందలకు పైగా వసూళ్లను సాధించి తెలుగు సినిమా రేంజ్‌ని మరోసారి పెంచింది. ఈ మూవీ విడుదలై నెల దాటింది. ఈ క్రమంలో కొద్ది రోజుల నుంచి ఈ మూవీలోని ఫుల్ సాంగ్స్‌ను ఒక్కొక్కొటిగా విడుదల చేస్తూ వస్తోంది చిత్ర యూనిట్.
చదవండి: నా తండ్రి గుర్తింపుతో బతకాలని లేదు: వేదాంత్ షాకింగ్ కామెంట్స్
ఈ క్రమంలో ఇప్పటికే విడుదలైన ‘కొమ్మ ఉయ్యాలా’,‘నాటు నాటు’, దోస్తి ఫుల్ వీడియో సాంగ్స్ యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ‘నెత్తురు మరిగితే ఎత్తర జెండా .. సత్తువ ఉరిమితే కొట్టర కొండా’ ఫుల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. రామ జోగయ్య శాస్త్రీ రాసిన ఈపాటకు ఎమ్ ఎమ్ కీరవాణి స్వరాలు అందించగా.. విశాల్ మిశ్రా, పృథ్వీ చంద్ర, సాహితి చాగంటి, హారిక నారాయణ్‌లు ఆలపించారు. ఈ పాటకు ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కాన్సెప్ట్ డిజైన్ చేయగా.. హరిశ్ కొరియోగ్రఫీ అందించాడు. తెలుగు, హాందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలైన ఈ సాంగ్ యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. విడుదలైన గంటల వ్యవధిలో లక్షల్లో వ్యూస్ రాబట్టింది.
చదవండి: షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కు వెళ్లిన అనుపమకు షాకిచ్చిన ఫ్యాన్స్
ఈ పాటకు తెలుగు వెర్షన్‌కు కొద్ది క్షణాల్లోనే 5 లక్షలకు పైగా వ్యూస్ రావడంతో యూట్యూబ్ ట్రెండింగ్‌లో నిలిచింది. తారక్, చరణ్ ఫుల్ ఎనర్జీతో స్టెప్పులు వేసిన పాట ఇది. స్వాతంత్య్ర సమరయోధులు, మహావీరుల చిత్రాలను చూపుతూ సాగే ఈ పాట దేశభక్తిని పెంచుతూ ఉత్సాహభరితంగా నడుస్తుంది. ఇక ఇందులో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో ఆలియా స్టెప్పులు వేసిన ఈ పాటలో అజయ్ దేవగన్, ఓలివియ కూడా కనిపించారు. ఇక చివరిలో ఎన్టీఆర్, చరణ్, అలియాలతో కలిసి జక్కన్న స్టెప్పులు వేయడం ఈ పాట విశేషం. థియేటర్లో సినిమాలో రోలింగ్ టైటిల్స్ సమయంలో వచ్చే ఈ పాటను.. ఇప్పుడు కూల్‌గా చూస్తూ నెటిజన్లు ఎంజాయ్ చేస్తూన్నారు. కాగా మార్చి 25న మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.
Comments
Please login to add a commentAdd a comment