Ram Charan Jr NTR: RRR Celebration Anthem Etthara Janda Song Promo Released Viral - Sakshi
Sakshi News home page

RRR Movie Song Promo: ఆర్‌ఆర్‌ఆర్‌ సెలబ్రేషన్స్‌: ఎత్తర జెండా సాంగ్‌ ప్రోమో రిలీజ్‌

Published Sat, Mar 12 2022 7:31 PM | Last Updated on Sun, Mar 13 2022 7:18 AM

RRR Celebration Anthem Etthara Janda Song Promo Released - Sakshi

RRR Celebration Anthem Etthara Janda Song Promo Released: జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ మల్టీస్టారర్లుగా నటించిన చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్‌'.  ఆలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా కనిపించనున్నారు.  దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా మార్చి 25న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో భాగంగా ఎత్తర జెండా అనే సెలబ్రేషన్‌ యాంథమ్‌ ప్రోమోను మూవీ టీం విడుదల చేసింది.

నెత్తురు మరిగితే ఎత్తెర జెండా.. సత్తువ ఉరిమితే కొట్టర కొండా అంటూ సాగే ఈ సాంగ్‌లో తారక్‌, చెర్రీ, ఆలియా కలర్‌ఫుల్‌గా కనిపించారు. ఫుల్‌ సాంగ్‌ను మార్చి 14న రిలీజ్‌ చేయనున్నారు. ఇక ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్‌ అయిన టీజర్‌, సాంగ్స్‌ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్‌ చేసిన నేపథ్యంలో ఆర్‌ఆర్‌ఆర్‌ ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement