RRR Title Secret: Rajamouli Reveals the Reason for Naming his Film RRR - Sakshi
Sakshi News home page

RRR Title Secret: ఆర్‌ఆర్‌ఆర్‌ టైటిల్‌ సీక్రెట్‌ రివీల్‌ చేసిన రాజమౌళి..

Published Fri, Dec 31 2021 12:02 PM | Last Updated on Fri, Dec 31 2021 12:57 PM

RRR Title Secret: Rajamouli Reveals the Reason for Naming his Film RRR - Sakshi

RRR Title Secret: Rajamouli Reveals the Reason for Naming his Film RRR: రామ్‌చరణ్‌, జూ ఎన్టీఆర్‌ హీరోలుగా నటించిన పాన్‌ ఇండియా సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌ జోరు పెంచారు. వరుస ఇంటర్వ్యూలతో మూవీ టీం ఫుల్‌ బిజీగా ఉంది. తాజాగా ''ది కపిల్‌ శర్మ షో'' లొ పాల్గొన్న రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్‌ టైటిల్‌ వెనుకున్న సీక్రెట్‌ను రివీల్‌ చేశారు. 

'ఈ సినిమా ప్రారంభించినప్పుడు ఏ టైటిల్‌ పెట్టాలో అర్థం కాలేదు. దీంతో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, రాజమౌళి ఇలా ముగ్గురి పేర్లు కలిసేలా RRR(ఆర్‌ఆర్‌ఆర్‌)అనుకున్నాం. సోషల్‌ మీడియాలో కూడా ఆ పేరుతోనే అప్‌డేట్స్‌ ఇచ్చాం. అన్ని భాషల నుంచి ఆర్‌ఆర్‌ఆర్‌కు మంచి స్పందన రావడంతో అదే పేరును కన్‌ఫర్మ్‌ చేశాం. కానీ నిజానికి ఆర్‌ఆర్‌ఆర్‌ అంటే రౌద్రం, రణం, రుధిరం' అని చెప్పుకొచ్చారు జక్కన్న. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement