RRR Movie: Dosti Full Video Song (Telugu) Out Now - Sakshi
Sakshi News home page

RRR Movie : చరణ్‌, తారక్‌ల స్నేహగీతం.. దోస్తీ ఫుల్‌ వీడియో సాంగ్‌ విడుదల

Published Thu, Apr 21 2022 7:21 PM | Last Updated on Thu, Apr 21 2022 7:38 PM

Ram Charan And Ntr Dosti Video Song From RRR Movie Out Now - Sakshi

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్లుగా తెరకెక్కిన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రం​ బాక్సాఫీస్‌ రికార్డులను తిరగరాసింది. వెయ్యి కోట్లకు పైగా వసూళ్లను సాధించి తెలుగు సినిమా సత్తా ఏంటో నిరూపించింది. ఇక ఇటీవలె ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన  ‘కొమ్మ ఉయ్యాలా’,‘నాటు నాటు’వీడియో సాంగ్స్‌ యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఈ చిత్రం నుంచి దోస్తీ సాంగ్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. విభిన్న దృవాల మధ్య స్నేహం గురించి వివరించిన ఈ పాటను సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించగా, కాల భైరవ ఆలపించారు. . ఎన్టీఆర్, చరణ్‌ల స్నేహ బంధాన్ని వివరిస్తూ తెరకెక్కిన ఈ సాంగ్‌ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

కాగా ఇక ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమురం భీమ్‌ పాత్రలో తారక్‌ నటించారు. డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించగా,  ఆలీయాభ‌ట్, ఒలీవియా హీరోయిన్లుగా నటించారు. బాలీవుడ్ స్టార్ అజ‌య్ దేవ‌గ‌న్ కీల‌క‌పాత్ర‌లో కనిపించారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement