
ఎన్టీఆర్, రామ్‌చరణ్
ఎన్టీఆర్, రామ్‌చరణ్ మంచి డ్యాన్సర్లు. కష్టమైన స్టెప్పులను కూడా సునాయాసంగా వేసి, అభిమానులతో విజిల్స్ కొట్టించగలరు. ఇదే హైలెట్ పాయింట్‌ను ఇప్పుడు ‘ఆర్‌ఆర్‌ఆర్’లో ఉపయోగించనున్నారట దర్శకుడు రాజమౌళి. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న పీరియాడికల్ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరమ్ భీమ్‌గా, చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లమీద ఓ జానపద పాట ఉండబోతోందని, ఇందులో ఇద్దరూ కలసి కాలు కదపనున్నారని తెలిసింది. ఇదే నిజమైతే ఈ హీరోల అభిమానులకు స్టెప్పుల విందే అని ఊహించొచ్చు. ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. చరణ్‌కి జోడీగా ఆలియా భట్ నటించనున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జూలైలో విడుదల కానుంది.