
పాత్రను బట్టి డైలాగ్ మారుతుంది. అది చెప్పే విధానం మారుతుంది. పరభాషా నటీనటులు తమకు రాని భాషలో సినిమాలు చేసేప్పుడు డైలాగ్స్ సరిగ్గా పలికేందుకు డైలాగ్ కోచ్‌లను పెట్టుకుంటారు. ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్ కూడా పలువురు డైలాగ్ ట్యూటర్స్‌ను నియమించిందట. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’ (రౌద్రం రణం రుధిరం).
డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. కొమరమ్ భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్ కనిపించనున్నారు. వీళ్లకు జోడీగా ఒలీవియా మోరిస్, ఆలియా భట్ నటించనున్నారు. ఒలీవియా హాలీవుడ్ నటి, ఆలియా బాలీవుడ్ నటి. అందుకే వీళ్ల కోసం ప్రత్యేకంగా డైలాగ్ ట్యూటర్స్‌ను ఏర్పాటు చేశారట. ఆలియా భట్ వచ్చే వారం నుంచి ఈ సినిమా చిత్రీకరణలో జాయిన్ అవుతారట. అజయ్ దేవగన్, సముద్రఖని ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రానికి కీరవాణి సంగీత దర్శకుడు.
Comments
Please login to add a commentAdd a comment