‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రీకరణలోకి బాలీవుడ్ భామ అలియా భట్ అడుగు పెట్టారు. సోమవారం హైదరాబాద్‌కు చేరుకొని రాజమౌళిని కలిశారు. ఈ మేరకు చిత్ర యూనిట్ అలియా, రాజమౌళికి చెందిన ఫోటోలను ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఈ ఫోటోలు నెట్టింటా వైరల్‌గా మారాయి. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ ఇటీవల తిరిగి ప్రారంభమైంది. అప్పటి నుంచి సెట్‌లోకి అలియా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అందరి అంచనాలు అందుకుంటూ ఆర్‌ఆర్‌ఆర్ షూటింగ్‌లో భాగం కానున్నారు. చదవండి: ఆర్‌ఆర్‌ఆర్ షూటింగ్ వీడియో వైరల్
యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఒలీవియా మోరిస్, ఆలియా భట్ కథానాయికలు. కొమరం భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ కనిపిస్తారు. ఇందులో రామ్‌చరణ్‌కు జోడీగా ఆలియా భట్ నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చిన ఆలియా. ‘‘ఫైనల్‌గా... ‘ఆర్‌ఆర్‌ఆర్’ షూటింగ్‌లో జాయిన్ కాబోతున్నానోచ్’’ అంటూ ముంబై నుంచి హైదరాబాద్ ప్రయాణంలో సెల్ఫీ పోస్ట్ చేశారామె. సినిమాలో తెలుగు డైలాగ్స్ పలికేందుకు శిక్షణ తీసుకున్నారు ఆలియా. ఈ చిత్రంలో అజయ్ దేవగన్, శ్రియ, సముద్ర ఖని ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సెంథిల్ కెమెరామేన్. ఈ సినిమా చిత్రీకరణ మార్చికల్లా పూర్తవుతుందని సమాచారం.
Beautiful and talented actress #AliaBhatt joins #RRRMovie shoot from today. She plays the role of #Sita in the film.@ssrajamouli @tarak9999 @AlwaysRamCharan @ajaydevgn @aliaa08 @oliviamorris891 @RRRMovie @DVVMovies pic.twitter.com/ToHK3CeQRY
— BARaju (@baraju_SuperHit) December 7, 2020
Comments
Please login to add a commentAdd a comment